హీరో ఎవరైనా ఒంటి మీద ఖాకీ డ్రెస్సు వేసుకునే క్యారెక్టర్ చేస్తే వచ్చే కిక్కే వేరు. తెలుగులో దాదాపు అందరు హీరోలు ఈ పాత్రను పోషించినవాళ్ళే. అలనాటి ఎన్టీఆర్ కొండవీటి సింహం, బాలకృష్ణ రౌడీ ఇన్స్ పెక్టర్, విజయశాంతి కర్తవ్యం, నాగార్జున రక్షణ, మహేష్ బాబు పోకిరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలున్నాయి. ఐకానిక్ బ్లాక్ బస్టర్స్ లో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం రాజశేఖర్ అంకుశందే. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1989లో వచ్చిన ఈ యాక్షన్ బ్లాక్ బస్టర్ చూశాక ఎందరో యువకుల్లో డిపార్ట్ మెంట్ లో చేరి దుర్మార్గుల భరతం పట్టాలన్న కసి కలిగింది.
ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం శ్రీవిష్ణు అల్లూరి. ట్రైలర్ ముందు వరకు దీని మీద పెద్ద బజ్ లేదు కానీ ఇప్పుడు మాత్రం అంచనాలు మెల్లగా పెరుగుతున్నాయి. ఏనాడూ లేనిది కెరీర్లో మొదటిసారి బారెడు మీసాలతో కొంత ఒళ్ళు పెంచి మరీ శ్రీవిష్ణు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇందులో అతని పేరు రామరాజు. టైటిల్ లో ఉన్నది ఇంటి పేరు. కాకతాళీయంగా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ బ్రిటిష్ పోలీస్ గా వేసింది కూడా ఇలాంటి వేషమే. డ్రెస్సు, మీసకట్టులో పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ కాప్ ఎంటర్ టైనర్ 23న రానుంది.
అంతా బాగానే ఉంది కానీ స్టోరీ లైన్ మాత్రం ఏమంత కొత్తగా అనిపించలేదు. ఓ పోలీసోడు, అతనికో భార్య, నగరంలో విలన్ గ్యాంగ్, అడవుల్లో నక్సలైట్లు, అన్నింటికి అడ్డుపడే మంత్రులు, వీళ్ళతో హీరో చేసే పోరాటం. ఇదే లైన్ మీదే వెళ్లినట్టు అనిపించింది కానీ టేకింగ్ లో మాత్రం ఇంటెన్సిటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ రవితేజ క్రాక్ లాగానో పైన చెప్పిన అంకుశం తరహాలో క్లిక్ అయితే శ్రీవిష్ణుకు మరో హిట్జ్ దక్కినట్టే. రాజరాజచోరలో దీనికి పూర్తి విరుద్ధమైన దొంగ పాత్ర వేసి మెప్పించిన శ్రీవిష్ణుకి ఆ తర్వాత అర్జునా ఫల్గుణ, భళా తందనాన డిజాస్టర్లు షాక్ ఇచ్చాయి. అల్లూరి రికవర్ చేస్తుందేమో చూడాలి
This post was last modified on September 17, 2022 6:36 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…