సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో తన అభిమానుల్ని విషాదంలోకి నెట్టి అప్పుడే మూడు వారాలు అయిపోయింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ యువ నటుడు ఇలా అర్ధంతరంగా తన జీవితాన్ని ముగిస్తాడని ఎవరూ అనుకోలేదు. క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉంచుకున్న అతను.. చివరగా తాను నటించిన సినిమా దిల్ బేచరా విడుదల కూడా కాకుండానే వెళ్లిపోయాడు. లాక్‌డౌన్ లేకుంటే ఆ సినిమా ఎప్పుడో విడుదలయ్యేది. అది రిలీజై మంచి విజయం సాధిస్తే.. ఆ ఉత్సాహంలో సుశాంత్ ఆత్మహత్య ఆలోచనలే చేసేవాడు కాదేమో. ఏదేమైనప్పటికీ.. సుశాంత్ మరణించిన నెలన్నరకే అతడి చివరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
అభిమానులు అతడి చివరి సినిమాను థియేటర్లలో చూసి అతడికి ఘనమైన నివాళి అర్పించాలనుకుంటున్నారు కానీ.. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించారు నిర్మాతలు. ఈ నెల 24నే దిల్ బేచరా డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ కానుంది. ఈ రోజే ట్రైలర్ కూడా లాంచ్ చేయగా.. అది అందరినీ ఆకట్టుకుంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని హాట్ స్టార్‌లో అందరూ ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. సబ్‌స్క్రిప్షన్ లేకున్నా ఉచితంగా సినిమా చూడొచ్చు. మామూలుగా పేరున్న సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత వచ్చినా ప్రీమియం కేటగిరీలో పెడుతుంటారు. అలాంటిది సుశాంత్ చివరి సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజవుతున్నా.. దానికి మంచి క్రేజ్ ఉన్నా.. ఉచితంగానే చూసే అవకాశం కల్పిస్తున్నారు. సుశాంత్‌కు ట్రిబ్యూట్‌గా ఈ అవకాశం కల్పిస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో కోట్లాది మంది ఈ సినిమాను చూడబోతున్నారన్నమాట.
This post was last modified on July 6, 2020 7:53 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…