Movie News

3 లెజెండరీ దర్శకులకు అగ్ని పరీక్ష

ఆగస్ట్ ని బ్లాక్ బస్టర్లతో హోరెత్తించిన టాలీవుడ్ కు సెప్టెంబర్ లో డబ్బింగ్ చిత్రాల తాకిడి ఎక్కువగా ఉంది. పైగా కల్ట్ దర్శకులు ముగ్గురు తీసిన సినిమాలు కేవలం పదిహేను రోజుల గ్యాప్ లో రావడం బహుశా ఇదే మొదటిసారని చెప్పొచ్చు. 17న విడుదల కాబోతున్న శింబు ది లైఫ్ అఫ్ ముత్తు ఏకంగా మూడు గంటల నిడివితో ప్రేక్షకులను పలకరించనుంది. ఏ మాయ చేసావే, ఘర్షణ లాంటి మూవీస్ తో టాలీవుడ్ లోనూ ఫాలోయింగ్ తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రోడక్ట్ కావడంతో మూవీ లవర్స్ దీని కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ఆకర్షణ.

మరొకటి ధనుష్ నేనే వస్తున్నా. 7జి బృందావన్ కాలనీతో యూత్ ని మెప్పించి యుగానికి ఒక్కడుతో ఇక్కడి ఆడియన్స్ ని సైతం షాక్ తో మేజిక్ చేసిన సెల్వ రాఘవన్ ప్రెజెంటేషన్ ఇది. తెలుగు వెర్షన్ ని గీతా ఆర్ట్స్ సమర్పిస్తోంది. ఇప్పటిదాకా బజ్ ఏమి లేదు కానీ మార్కెటింగ్ లో మంచి పట్టున్న అల్లు టీమ్ రిలీజ్ డేట్ అనుకుంటున్న సెప్టెంబర్ 29నాటికి హైప్ తీసుకొస్తారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ దీనికి ప్లస్ కానుంది. తిరు తెలుగులోనూ సక్సెస్ కావడంతో ఈ నేనే వస్తున్నాకి బిజినెస్ బాగా జరగొచ్చు. పైగా గీతా డిస్ట్రిబ్యూషన్ అంటే థియేటర్ల విషయంలో చింత అక్కర్లేదు.

చివరిది 30న రానున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1. ట్రైలర్ చూశాక ఇందులో ఏ రేంజ్ లో విజువల్ గ్రాండియర్ ఉందో అర్థమయ్యింది. కానీ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న అరవ వాసన వల్ల ఇప్పటికైతే దీని గురించి మనవాళ్ళు పెద్దగా మాట్లాడుకుంటున్న దాఖలాలు లేవు. ఇది అందిస్తోంది దిల్ రాజు కాబట్టి రిలీజ్ గ్రాండ్ గానే ఉంటుంది. ఈ లెజెండరీ డైరెక్టర్లు తీసిన మూడు సినిమాలు ఒకే నెలలో బడా ప్రొడక్షన్ హౌసుల సహకారంతో వస్తున్నాయి. డబ్బింగ్ మార్కెట్ డల్ గా ఉన్న తరుణంలో ఇవి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి. దేనికీ చెప్పుకోదగ్గ భారీ స్ట్రెయిట్ తెలుగు సినిమా పోటీ లేకపోవడం ఒకటే సానుకూలాంశం.

This post was last modified on September 14, 2022 12:47 pm

Share
Show comments

Recent Posts

మొదటి రిలీజ్ 3 కోట్లు – రీ రిలీజ్ 7 కోట్లు

ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…

6 hours ago

శంకర్ ఆడుతున్న ఒత్తిడి గేమ్

సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…

6 hours ago

ముందు లక్కు వెనుక చిక్కు

యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…

6 hours ago

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా…

6 hours ago

డిజాస్టర్ సినిమాకు రిపేర్లు చేస్తున్నారు

కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…

11 hours ago

చిన్న బడ్జెట్‌లతో పెద్ద అద్భుతాలు

స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…

11 hours ago