Movie News

డిక్ష‌న‌రీలు తిర‌గేస్తున్న మ‌హేష్ ఫ్యాన్స్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి సినిమా గురించి చ‌ర్చ ఇప్ప‌టిది కాదు. దాదాపు ద‌శాబ్దంన్న‌ర కింద‌ట వీరి మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయి. స్వ‌యంగా మ‌హేష్ బాబే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా గురించి అప్ప‌ట్లో హింట్ ఇచ్చాడు. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల వీరి కాంబో అప్పుడు సెట్ కాలేదు.

ఐతే దీని గురించి మ‌హేష్ ఫ్యాన్స్ మ‌రీ బాధ ప‌డాల్సిన ప‌ని అయితే లేదు. అప్పుడు జ‌క్క‌న్న‌తో మ‌హేష్ సినిమా చేస్తే అది మామూలుగానే ఉండేదేమో. కానీ ఇప్పుడు బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో రాజ‌మౌళి పేరు ప్ర‌పంచ స్థాయిలో మార్మోగాక‌, ఆయ‌న సినిమాల‌కు మినిమం వెయ్యి కోట్ల వ‌సూళ్లు వ‌చ్చే ప‌రిస్థితుల్లో త‌న‌తో జ‌ట్టు క‌డుతున్నాడు సూప‌ర్ స్టార్.

దీంతో ఈ కాంబినేష‌న్ మీద అంచ‌నాలు మామూలుగా లేవు. వీరి క‌ల‌యిక‌లో రాబోయే సినిమా గురించి ఏ చిన్న క‌బురు వినిపించినా అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. తాజాగా టొరంటో ఫిలిం ఫెస్టివ‌ల్‌కు అతిథిగా హాజ‌ర‌మైన రాజ‌మౌళి.. మ‌హేష్‌తో తాను చేయ‌బోయే సినిమా గురించి చేసిన కామెంట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది.

మ‌హేష్‌తో త‌న సినిమా గురించి మాట్లాడుతూ.. globetrotting action adventure అని వ్యాఖ్యానించాడు జ‌క్క‌న్న‌. ఆయ‌నీ మాట అన‌గానే.. globetrotting అంటే ఏంటి అంటూ డిక్ష‌న‌రీల మీద ప‌డిపోయారు మహేష్ ఫ్యాన్స్. ఈ ప‌దానికి ‘పంచ‌వ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందే’ అని అర్థ‌మ‌ట‌. అంటే ఈ సినిమా పాన్ వ‌ర‌ల్డ్ లెవెల్లో ఉంటుంద‌ని జ‌క్క‌న్న చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది. ఇక యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ అని రాజ‌మౌళి అన‌డాన్ని బ‌ట్టి ఇది ముందు నుంచి ప్ర‌చారంలో ఉన్న‌ట్లే ఆఫ్రికా అడ‌వుల్లో సాగే క‌థ అయి ఉండొచ్చ‌ని, ఇండియానా జోన్స్ త‌ర‌హాలో సినిమా ఉన్నా ఆశ్చ‌ర్యం లేద‌ని అనుకుంటున్నారు.

This post was last modified on September 13, 2022 12:24 pm

Share

Recent Posts

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

2 minutes ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

9 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

11 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

11 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

12 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

15 hours ago