ఛలో లాంటి సూపర్ హిట్ తర్వాత కెరీర్ మెట్రో ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతుందనుకుంటే సినిమాలైతే కౌంట్ పరంగా పెరుగుతున్నాయి కానీ ఆ స్థాయి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరో నాగ శౌర్య. దాని తర్వాత చేసిన కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల అన్నీ ఫ్లాపే. ఓ బేబీ సక్సెసే కానీ ఆ క్రెడిట్ మొత్తం సమంతా ఖాతాలోకి వెళ్లిపోయింది కాబట్టి దాని గురించి గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి. సీరియస్ గా ట్రై చేసిన అశ్వద్ధామ పర్లేదనిపించుకుంది కానీ కమర్షియల్ గా థియేట్రికల్ రన్ లో నిర్మాతకు తెచ్చిందేమి లేదని వసూళ్లు స్పష్టం చేశాయి.
ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుడు కావాలెను సోసోగా వెళ్లడం మరింత బాధను కలిగించింది. లేడీ డైరెక్టర్ అయినా ఫలితం మారలేదు. ఇక లక్ష్యను గుర్తు చేసుకోకపోవడం మంచిది. ఒళ్ళు హూనం చేసుకుని సిక్స్ ప్యాక్ చేస్తే బాక్సాఫీస్ వద్ద జీరో రిజల్ట్ వచ్చింది. వీటి దెబ్బకే నిర్మాణం ఎప్పుడో పూర్తి చేసుకున్న కృష్ణ వృంద విహారి పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 23న విడుదల కానుంది. టీజర్, పాటలు గట్రా ఎప్పుడో వచ్చినా అంచనాలేం పెరగలేదు కానీ ట్రైలర్ చూశాక మాత్రం కంటెంట్ లో ఏదో విషయమున్నట్టే కనిపిస్తోంది.
ఇందులో నాగశౌర్య అచ్చమైన సంప్రదాయాలకు విలువిచ్చి పాటించే బ్రాహ్మణ యువకుడిగా నటించాడు. ఇదే తరహా క్యారెక్టర్ ని ఆ మధ్య నాని అంటే సుందరానికిలో చూశాం కదా. క్యారెక్టరైజేషన్ లో కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అయితే నాని ఎంత బాగా చేసినా దాని రిజల్ట్ ని కాపాడలేకపోయాడు. కానీ ఈ కృష్ణ వృంద విహారిలో ఎంటర్ టైన్మెంట్ పాలు కాస్త గట్టిగానే దక్కించారు. జోకులైతే మంచి టైమింగ్ తోనే నవ్వించాయి. మరి సినిమా మొత్తం ఇందులో చూపించినట్టే ప్రామిసింగ్ గా ఉంటే శౌర్యకు హిట్టు దక్కినట్టే. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on September 11, 2022 10:44 am
వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్న నాని ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్దిల…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ…
ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఎదురైన పాఠాలే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు భవిష్యత్తు మార్గాలను చూపిస్తున్నాయా? ఆదిశగా…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం…