అమల.. 80, 90 దశకాల్లో సినిమాలు చూసిన సౌత్ ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేని పేరిది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో అప్పటి యువతను కట్టిపడేసింది ఆమె. అయితే కెరీర్ మంచి ఊపులో ఉండగానే అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయారు అమల.
మళ్లీ చాలా ఏళ్ల తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత మరో సినిమా చేయలేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అమలు చేసిన అమ్మ పాత్రకు మంచి స్పందన వచ్చినప్పటికీ ఆ సినిమా ఆడక పోవడం వల్ల ఏమో ఆమె బ్రేక్ తీసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఒకే ఒక జీవితం సినిమాకు అమల పాత్ర, ఆమె నటన మేజర్ హైలెట్ అని చెప్పాలి. అమల చేయడం వల్ల ఆ పాత్రకు ఒక కొత్తదనం వచ్చింది. తనతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ చాలా హృద్యంగా సాగడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సన్నివేశాలతోనే బలమైన ఇంపాక్ట్ వేసింది ఆ క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో ఎమోషనల్ గా ఈ స్థాయిలో కదిలించిన పాత్రలు అరుదు అని చెప్పాలి.
కథానాయికగా చేసినప్పుడు అమల అందం గురించి అందరూ మాట్లాడుకొన్నారు కానీ నటన గురించి పెద్దగా చర్చ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరూ ఆమె యాక్టింగ్ గురించి చర్చించుకుంటున్నారు. అమల నుంచి ఇలాంటి పాత్రలు మరిన్ని ఆశిస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత తీసుకున్నట్లు అమల ఈసారి బ్రేక్ తీసుకోదని, అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాత్రలు చేస్తూ తమను అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
This post was last modified on September 10, 2022 5:46 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…