భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ దక్కాయి కానీ టాక్ మాత్రం డివైడ్ గా ఉంది. హంగులు గ్రాఫిక్స్ గట్రా బాగానే ఉన్నప్పటికీ అసలైన ఎమోషన్లు ఎలివేషన్లు మిస్ అవ్వడంతో ఊహించిన స్థాయిలో థ్రిల్ ఫీలవ్వలేదని మెజారిటీ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాట. పది నిముషాలు కనిపించే చిన్న క్యామియోలకు సైతం బడా స్టార్లను తీసుకురావడం అభిమానులను ఆకట్టుకుంది. నాగార్జునది ముందే రివీల్ చేశారు కానీ షారుఖ్ ఖాన్ మాత్రం సినిమా మొదట్లోనే స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
అన్ని చోట్ల థియేటర్లలో వీళ్లిద్దరి ఎంట్రీ విజిల్స్ పడ్డాయి. అయితే దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ క్యారెక్టర్లను తీర్చిదిద్దిన తీరు నిరాశ కలిగించింది. వాటిని అర్ధాంతరంగా ముగించడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఇంత ఇమేజ్ ఉన్న నటులు దొరికినప్పుడు గూస్ బంప్స్ తో ఊగిపోయే ఎపిసోడ్లు సెట్ చేసుకోవాలి. అసలే షారుఖ్ ని తెరమీద చూసి మూడేళ్లు దాటేసింది. మొన్న రాకెట్రీలో కనిపించాడు కానీ అది వేరొకరి రియల్ లైఫ్ బయోపిక్ కాబట్టి తనకంటూ ప్రత్యేకంగా స్కోప్ దక్కలేదు. కానీ బ్రహ్మాస్త్ర అలా కాదు. పూర్తి ఫాంటసీ. ఉన్నది పావు గంటైనా సరిగా రాసుకుంటే పేలిపోయేది.
నిజానికి క్యామియో అంటే ఎలా ఉండాలో పెదరాయుడులో రజనీకాంత్, కన్నడ మూవీ సిపాయిలో చిరంజీవి, నిన్నే ప్రేమిస్తాలో నాగార్జున ఇలా డిజైన్ చేసుకుంటే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కానీ అయాన్ మాత్రం మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. రన్బీర్ కపూర్ అలియా భట్ ల కెమిస్ట్రీ మీద పెట్టిన దృష్టి పూర్తి స్క్రిప్ట్ మీద కూడా వర్క్ చేసుంటే ఇంకో లెవెల్ లో ఉండేదన్న మాట వాస్తవం. టాక్ సంగతి ఎలా ఉన్నా బ్రహ్మాస్త్రకు తెలుగు రాష్ట్రాల్లో ధూమ్ 3 తర్వాత దాన్ని దాటిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ వీకెండ్ లో వీటిని కాపాడుకుంటే హిట్టు కొట్టినట్టే. చూడాలి మరి
This post was last modified on September 10, 2022 1:16 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…