Movie News

6 ఫ్లాపుల తర్వాత కిక్కు దొరికింది

మాములుగా ఒక సినిమాకు యునానిమస్ గా చాలా బాగుందనే టాక్ రావడం అరుదు. అదృష్టవశాత్తు టాలీవుడ్ కు ఆగస్ట్ నుంచి వరసగా ఇలాంటివి వినిపిస్తూనే ఉన్నాయి. గత నెల సీతారామం, బింబిసార, కార్తికేయ 2లు ఆ టార్గెట్ ని ఈజీగా అందుకోగా తాజాగా ఒకే ఒక జీవితంకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం పెద్ద రిలీఫ్ ని కలిగిస్తోంది. మీడియాతో మొదలుపెట్టి మొదటి ఆట చూసి బయటికి వచ్చిన కామన్ ఆడియన్స్ దాకా ప్రతిఒక్కరు కాన్సెప్ట్ కి, టేకింగ్ కి, శర్వానంద్ తో పాటు మిగిలినవారందరి పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు ఇస్తుండటంతో యూనిట్ ఆనందం మాములుగా లేదు.

వాస్తవానికి అదే రోజు రావడం వల్ల ఒకే ఒక జీవితం మీద బ్రహ్మాస్త్ర దెబ్బ గట్టిగా పడింది. చాలా చోట్ల దానికి హౌస్ ఫుల్స్ ఉదయం నుంచే పడగా శర్వా మూవీకి మాత్రం మ్యాట్నీ దాకా పెద్దగా ఆక్యుపెన్సీలు కనిపించలేదు. సోషల్ మీడియా మద్దతుతో పాటు పబ్లిక్ రెస్పాన్స్ బాగుండటంతో ఈవెనింగ్ షో నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో టికెట్లు తెగడం మొదలయ్యింది. రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి ఫ్యామిలీస్ ని ఒకే ఒక జీవితం ఈజీగా లాగేస్తుందని ట్రేడ్ అంచనా. బ్రహ్మాస్త్రకు వచ్చిన డివైడ్ టాక్ ఎంతవరకు సానుకూలాంశంగా మారుతుందో ఇంకో రోజు ఆగితే క్లారిటీ వస్తుంది.

శర్వానంద్ ఇప్పుడు ఎన్నాళ్ళో వేచిన ఉదయం పాట పాడుకునే మూడ్ లో ఉన్నాడు. ఒకటా రెండా వరసగా ఆరు డిజాస్టర్లు మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు వీటిలో ఏదీ కనీసం యావరేజ్ కూడా కాలేకపోయింది. రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాకపోయినా ఆదరణ దక్కలేదు. ఇప్పుడా కొరత మొత్తంగా ఒకే ఒక జీవితం తీర్చేలా ఉంది. కమర్షియల్ ఫిగర్స్ ఏ మేరకు నమోదవుతాయనేది రేపటి నుంచి తెలుస్తుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కొత్త కాకపోయినా దానికి మదర్ సెంటిమెంట్ జోడించి ఫ్రెష్ ట్రీట్మెంట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకార్తీక్ కి ప్రశంసలు దక్కుతున్నాయి .

This post was last modified on September 10, 2022 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

37 minutes ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

37 minutes ago

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

4 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

4 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

5 hours ago