గాడ్ ఫాదర్.. మెగాస్టార్ చిరంజీవికి చాలా ముఖ్యమైన చిత్రమిది. రీఎంట్రీలో చేసిన తొలి చిత్రం ఖైదీ నంబర్ 150 మినహాయిస్తే చిరు చేసిన రెండు సినిమాలు సైరా, ఆచార్య ఆయనకు నిరాశా జనక ఫలితాన్నే అందించాయి. సైరా ఉన్నంతలో బాగానే ఆడినా మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టేయడం వల్ల అది కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇక ఆచార్య సంగతి చెప్పాల్సిన పనే లేదు. చిరు కెరీర్లోనే ఇది ఒక పెద్ద మచ్చ అని చెప్పొచ్చు. అది టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ మీద చిరు చాలా ఆశలే పెట్టుకున్నాడు.
ఐతే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ అయితే కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం.. ఇది ఒక రీమేక్ కావడమే. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లూసిఫర్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా.. దాని డబ్బింగ్ వెర్షన్ కూడా తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం.
ఐతే ఇంకో నాలుగు వారాల్లోపే గాడ్ ఫాదర్ దసరా కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా.. చిత్ర బందం ప్రమోషన్లతో హోరెత్తించి సినిమాకు బజ్ పెంచే ప్రయత్నాలేమీ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుక్కారణం టీం తీరిక లేకుండా పని చేస్తుండడమే. దీని షూటింగ్ చివరి దశలో ఉంది. దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్, ఆడియో పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యే రిలీజైన టీజర్లో వీఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో వాటిపై మళ్లీ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. దీని వల్ల టీం బాగా హడావుడి పడుతోందని.. దసరా డెడ్ లైన్‌ను అందుకోగలమా లేదా అనే టెన్షన్ నడుస్తోందని.. అందుకే ప్రమోషన్లకు టైం కేటాయించలేకపోతున్నారని సమాచారం.
ఈ సినిమాను దసరా రేసు నుంచి తప్పించి డిసెంబరులో రిలీజ్ చేయాలన్న చర్చ కూడా జరిగింది కానీ.. మంచి సీజన్‌ను వదులుకోవడమే కాక వాయిదా వేయడం ద్వారా నెగెటివిటీని కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశంతో దసరా రిలీజ్‌కే కట్టుబడి ఉన్నారని సమాచారం. కానీ ఆ డెడ్ లైన్‌ను అందుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు.
This post was last modified on September 7, 2022 7:19 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…