తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఇది కోలీవుడ్ బాహుబలి అని చెప్పొచ్చు. బడ్జెట్, కాస్టింగ్, కథాంశం.. ఇలా ఏ రకంగా చూసుకున్నా బాహుబలికి దీటుగా కనిపిస్తోందీ చిత్రం. ఎంతోమంది లెజెండ్స్ ఈ సినిమా కోసం కలిసి పని చేశారు. సౌత్ ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మణిరత్నం దశాబ్దాల కల ఈ సినిమా. లైకా ప్రొడక్షన్స్ అండతో తన సొంత బేనర్ మద్రాస్ టాకీస్ మీద రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించాడు మణిరత్నం.
మామూలుగానే మణిరత్నంకు భాషలకు అతీతంగా అభిమానులున్నారు. ఇందులోని నటీనటులందరూ కూడా దేశవ్యాప్తంగా ఫేమ్ ఉన్న వాళ్లే. ఇక చారిత్రక నేపథ్యంలో తెరకెక్కడం వల్ల అన్ని భాషల వాళ్లూ కనెక్టయ్యేందుకు అవకాశం ఉంది. ఇన్ని సానుకూలాంశాలు కనిపిస్తున్నా పొన్నియన్ సెల్వన్‌కు తమిళనాడు అవతల అనుకున్నంత బజ్ అయితే రాలేదు.
సినిమా మొదలైన దగ్గర్నుంచి కూడా ఇతర భాషల వాళ్లు పొన్నియన్ సెల్వన్ పట్ల అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఇక సినిమా పూర్తయి ప్రధాన పాత్రధారుల లుక్స్ రిలీజ్ చేసినపుడు.. పాటలు ఒక్కొక్కటిగా లాంచ్ చేసినపుడు.. అలాగే టీజర్ వదిలినపుడు.. ఇలా ఏ సందర్భంలోనూ తమిళేతర భాషల వాళ్లకు ఎగ్జైట్మెంట్ కలగలేదు. టీజర్‌తో పోలిస్తే తాజాగా రిలీజైన ట్రైలర్ బెటరే కానీ.. అది కూడా ఇవ్వాల్సినంత కిక్ ఇవ్వలేదు.
ఇందుకు పరోక్షంగా రాజమౌళి ఒక కారణం అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల్లో రాజమౌళి చూపించే భారీతనం, ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఒక హై ఇస్తాయి. కానీ మణిరత్నం స్టైల్ అది కాదు. ఆయన ఏదైనా సటిల్‌గా తీస్తారు. క్లాస్ టచ్ ఉంటుంది. రాజమౌళి సినిమాలకు అలవాటు పడ్డ జనాలకు పొన్నియన్ సెల్వన్ ఆశించినంత ఎగ్జైట్మెంట్ ఇవ్వడం లేదు. దీనికి తోడు ఇది తమిళ పురాణాల నుంచి తీసుకున్న కథ కావడం.. ప్రతిదాంట్లోనూ తమిళ వాసనలు గుప్పుమనడం.. నేటివిటీ ఫ్యాక్టర్ డామినేట్ చేయడం సమస్యగా మారింది. కాబట్టే తమిళులు ఆహా ఓహో అంటున్నా మనవాళ్లకు మాత్రం పొన్నియన్ సెల్వన్ ఇప్పటిదాకా అయితే పెద్దగా ఎక్కట్లేదన్నది స్పష్టం.
మరి ఈ సినిమా బడ్జెట్ ప్రకారం చూస్తే.. కేవలం తమిళులు ఆదరిస్తే సరిపోదు. పాన్ ఇండియా లెవెల్లో సినిమా అదరగొట్టాలి. మరి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు ఏమేర ఇతర భాషల వాళ్లను మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on September 7, 2022 6:58 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…