లైగర్ తో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ ‘ఖుషి’ సినిమాను రెడీ చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. దీని తర్వాత విజయ్ నెక్స్ట్ సినిమా ఏంటంటే విషయంపై రౌడీ ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ నెలకొంటుంది. నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఖుషి ఫినిష్ అవ్వగానే విజయ్ మళ్ళీ పూరి తో జనగణమన స్టార్ట్ చేయాలి. కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు విజయ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా ? అనే ప్రశ్న మొదలైంది.
లైగర్ సెట్స్ పై ఉండగానే సుకుమార్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఎనౌన్స్ అయింది. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. పుష్ప 2 తో సుకుమార్ మళ్ళీ బిజీ అయ్యాడు. ఇంకా షూటింగ్ మొదలు పెట్టని ఈ సినిమా కోసం సుక్కు ఏడాదిన్నర పైనే తీసుకోనున్నాడు. అంటే ఇప్పట్లో విజయ్ తో సుకుమార్ సినిమా ఉండకపోవచ్చు. ఒకవేళ పుష్ప 2 కూడా భారీ హిట్టయితే సుకుమార్ మీద స్టార్ హీరోలంతా కర్చీఫ్ వేస్తారు.
అందుకే విజయ్ ఇప్పుడు తనకి వచ్చిన గ్యాప్ లో ఓ మంచి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. గీత గోవిందం తర్వాత దిల్ రాజు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. దీంతో తాజాగా విజయ్ దిల్ రాజు ని కలిసి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వెంటనే దిల్ రాజు పవన్ సినిమా కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతం కాళీగా ఉన్న హరీష్ శంకర్ తో విజయ్ కి ఓ ప్రాజెక్ట్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు భోగట్టా. అన్ని సెట్ అయితే సుకుమార్ సినిమా కంటే ముందు విజయ్ హరీష్ శంకర్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. మరి ఈ కాంబో కుదురుతుందా ? లేదా చూడాలి.
This post was last modified on September 7, 2022 3:36 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…