మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న రిలీజ్ అవ్వబోతుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై బజ్ ఉంది. కానీ మేకర్స్ ఊహించినంత హైప్ రావడం లేదు. అందుకే నెలాఖరున ఓ గ్రాండ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా తీసుకురావాలని భావిస్తున్నారు. చిరు -పవన్ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులవుతుంది. సైరా ఈవెంట్ తర్వాత మళ్ళీ స్టేజి పై ఇద్దరు కనిపించలేదు.
ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ఎలానో వస్తారు. అలాగే స్పెషల్ గెస్ట్ గా పవన్ వస్తే సినిమాకు క్రేజ్ వస్తుందని మెగా ఈవెంట్ హైలైట్ అవుతుందని అనుకుంటున్నారు. అందుకే పవన్ ని గెస్ట్ గా పిలవాలని ఫిక్సయినట్టు సమాచారం. ఇక సల్మాన్ ఖాన్ ని హిందీ మార్కెట్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ముంబై లో కూడా హిందీ వర్షన్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ బిగ్ బీ అమితాబ్ ని కూడా రంగంలోకి దింపాలని చిరు అనుకుంటున్నారని తెలుస్తుంది.
ఇక గాడ్ ఫాదర్ ఈవెంట్ ను ఈ నెలాఖరున చేయబోతున్నారు. అప్పుడు పర్మిషన్ కూడా ఈజీగా వస్తుంది కాబట్టి భారీ ఎత్తున ఈవెంట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి పవన్ అన్నయ్య సినిమాకు తన స్పీచ్ తో ఎలాంటి హైప్ తెస్తాడో చూడాలి. ఒకవేళ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లే పవన్ వస్తే …చిరు పవన్ సల్మాన్ ఫొటోస్ వైరల్ అవుతాయి. మెగా బ్రదర్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతాయి. దీంతో సినిమాకు మంచి ప్రమోషన్ వచ్చినట్టే. ఆలాగే అదే వేదికపై ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈసారి ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేయాలని టీం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.
This post was last modified on September 7, 2022 12:42 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…