టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్స్ లో సురేష్ ప్రొడక్షన్ ఒకటి. రామానాయుడు గారి లెగసీని కంటిన్యూ చేస్తూ సురేష్ బాబు ఈ సంస్థను రన్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న సురేష్ బాబు అన్ని విషయాల్లో ముందుంటారు. అల్లు అరవింద్ , సురేష్ బాబు , దిల్ రాజు ఈ ముగ్గురే ఏ విషయం గురించైనా అలవోకగా మాట్లాడుతుంటారు. టాలీవుడ్ లో ఏ టాపికయినా సురేష్ బాబు దగ్గర కచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అలాంటి సురేష్ బాబు ఈ మధ్య మీడియాకి దూరంగా ఉంటున్నారు.
ఇటివలే టాలీవుడ్లో ఓ సమస్య వచ్చింది. షూటింగ్స్ ఆపేసి మరీ గిల్డ్ నిర్మాతలందరూ ఏకమయ్యారు. అందులో సురేష్ బాబు కూడా ఉన్నారు. కొన్ని మెయిన్ మీటింగ్స్ కి అటెండయ్యారు కూడా. కానీ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. గిల్డ్ తరుపున దిల్ రాజు , సి కళ్యాణ్ , దామోదర ప్రసాద్ ఇలా కొందరు మాత్రమే మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.
అయితే సురేష్ బాబు ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ విషయంలోనే కాదు తను నిర్మించిన సినిమా, రిలీజ్ చేస్తున్న సినిమా ప్రెస్ మీట్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. సురేష్ ప్రొడక్షన్ నుండి వస్తున్న శాకిని డాకిని సినిమా ప్రమోషన్స్ లో కూడా కనిపించడం లేదు. అంతెందుకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న రానా సినిమా ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో కూడా సురేష్ పాల్గొనలేదు. నారప్ప , దృశ్యం 2 సినిమాల ప్రమోషన్స్ లో యాక్టివ్ గా కనిపించి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చి అన్ని విషయాల గురించి మాట్లాడిన సురేష్ బాబు ఇప్పుడు ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయిపోయారు ? ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు ? తెలియాల్సి ఉంది.
This post was last modified on September 7, 2022 12:14 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…