ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల మీద మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించిన దానికన్నా బాగా ఉండటం బాలీవుడ్ కి ఊరట కలిగిస్తోంది. హైదరాబాద్ మల్టీ ప్లెక్సుల్లో హిందీ వెర్షన్ కి 325 రూపాయల ధర పెట్టినా చెప్పుకోదగ్గ స్థాయిలో అమ్మకాలు జరగడం మంచి పరిణామం. దీని వల్ల శర్వానంద్ ఒకే ఒక జీవితంకి స్క్రీన్ కౌంట్ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ బయటికి వచ్చాక ఏది నిలుస్తుందో తేలుతుంది కానీ అప్పటిదాకా కొంత టెన్షన్ తప్పేలా లేదు.
ఇక్కడే వినాయకుడు చిన్న ట్విస్టు ఇచ్చాడు. అదే రోజు భాగ్యనగరంలో నిమజ్జనం ఉంటుందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. సో హైదరాబాద్ సిటీతో పాటు ఇతర పట్టణాలు నగరాల్లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు సిటీ మొత్తం బంద్ ఉంటుంది. జనాలు రోడ్లమీదకొచ్చి బొజ్జ గణపయ్య విగ్రహాలను చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు. బయటకి రాలేని వాళ్ళు టీవీ లైవ్ తో సరిపెట్టుకుంటారు. ట్యాంక్ బండ్ దగ్గర రచ్చ తెలిసిందే. ఈ నేపథ్యంలో రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్ తో బ్లాక్ అయ్యి ఉంటాయి.
ఇలాంటి పరిస్థితిలో జనం థియేటర్లకొచ్చి ఇబ్బందులు పడుతూ సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. సహజంగానే దీని ప్రభావం కొంత కలెక్షన్ల మీద పడుతుంది. ప్రయాణం ఎక్కడ ఎలా ఆగుతుందో ఎంత సేపు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అలాంటప్పుడు సినిమాల కోసమని రిస్క్ తీసుకునే ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గిపోతారు. ఒక రోజు ఆగుదాంలే అనుకుంటారు. పైగా ఖైరతాబాద్ పరిసరాల్లో హాళ్లు బంద్ చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి బ్రహ్మాస్త్రతో పాటు, ఒకే ఒక జీవితం, కెప్టెన్ లు ఇబ్బంది ఫేస్ చేయాల్సిందే. బాగుందనే మాట బయటికొస్తే రెండో రోజు నుంచి దూసుకుపోవచ్చు.
This post was last modified on %s = human-readable time difference 8:44 pm
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…