Movie News

డేంజర్ జోన్లో ఉన్నోళ్లంతా ఒకటయ్యారు

శర్వానంద్‌కు కొన్నేళ్ల ముందు హీరోగా ఎంత డిమాండ్ ఉండేదో తెలిసిందే. రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి వరుస హిట్లతో అతను దూసుకెళ్లాడు. తర్వాత ఒకట్రెండు ఫ్లాపులు పడ్డా ‘మహానుభావుడు’తో పుంజుకున్నాడు. అతడికి అప్పుడు రూ.30 కోట్ల దాకా మార్కెట్ ఉండేది. పేరున్న బేనర్లలో మంచి బడ్జెట్లలో సినిమాలు చేసేవాడు. కానీ ‘మహానుభావుడు’ తర్వాత వరుసగా డిజాస్టర్లు ఎదురవడంతో అతడి మార్కెట్ కరిగిపోతూ వచ్చింది. డిమాండ్ పడిపోయింది.

ఇప్పుడు శర్వాతో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి తలెత్తింది. చివరగా వచ్చిన అతడి సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఏమాత్రం ప్రభావం చూపకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘ఒకే ఒక జీవితం’ మీద ఉన్నాయి. ఐతే శర్వా వరుస ఫ్లాపుల వల్ల ఈ సినిమాకు అంతగా బజ్ క్రియేట్ కాలేదు. ఈ శుక్రవారమే ‘ఒకే ఒక జీవితం’ రిలీజవుతుండగా.. ఈలోపు లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్యతో సోమవారం తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టేశాడు శర్వా.

ఇంకో ఫ్లాపు పడితే ఇండస్ట్రీలో తన ఉనికే ప్రశ్నార్థకం అయ్యే స్థితిలో శర్వా.. కృష్ణచైతన్యతో జట్టు కడుతున్నాడు. ఆ దర్శకుడి పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ‘రౌడీ ఫెలో’తో అరంగేట్రంలోనే ఆకట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాత దర్శకుడిగా అతడి కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదు. రెండో చిత్రం ‘ఛల్ మోహన రంగ’ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నితిన్‌తోనే ‘పవర్ పేట’ కోసం చాలా కష్టపడ్డాడు. కానీ అది అనివార్య కారణాలతో ఆగిపోయింది. దీంతో చాన్నాళ్ల పాటు కృష్ణచైతన్య ఖాళీగా ఉండిపోయాడు.

చివరికిప్పుడు శర్వా లాంటి ఫ్లాప్ హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తేడా కొడితే అతడికీ కష్టమవుతుంది. ఇక ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న రాశి ఖన్నా పరిస్థితి సరే సరి. తాజాగా ఆమె ‘థాంక్యూ’ రూపంలో పెద్ద డిజాస్టర్ ఖాతాలో వేసుకుంది. దానికి ముందు పక్కా కమర్షియల్, వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఆమెను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇలాంటి ట్రాక్ రికార్డుతో మళ్లీ ఓ అవకాశం అందుకోవడం విశేషమే. కానీ ఈ చిత్రం తేడా కొడితే ఆమె కెరీర్ కూడా క్లోజ్ అయినట్లే. ఐతే ఇలా డేంజర్ జోన్లో ఉన్న వాళ్లందరినీ నమ్మి ‘కార్తికేయ-2’తో మెగా సక్సెస్ అందుకున్న టీజీ విశ్వ ప్రసాద్ సినిమా నిర్మిస్తుండటం విశేషమే.

This post was last modified on September 5, 2022 8:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

57 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago