సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా చాలా ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ తమన్నాకు.. తన మాతృ భాషలో మాత్రం ఇప్పటిదాకా ఒక్క విజయం కూడా దక్కలేదు. ముందుగా బాలీవుడ్లోనే కథానాయికగా అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత కూడా అడపాదడపా అక్కడ అవకాశాలు దక్కించుకున్నా.. సక్సెస్ మాత్రం రుచి చూడలేకపోయిందామె. హిమ్మత్‌వాలా, ఎంటర్టైన్మెంట్ సహా ఆమె చేసిన సినిమాలన్నీ నిరాశకు గురి చేశాయి.
అయినా ప్రయత్నం ఆపని తమ్మూ.. ఇప్పుడు ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో హిందీ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఆ చిత్రమే.. బబ్లీ బౌన్సర్. చాందిని బార్, ఫ్యాషన్ సహా కెరీర్ అంతా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే తీసిన మాధుర్ బండార్కర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఐతే మాధుర్ చాలా ఏళ్ల నుంచి విజయాల్లో లేడు. అలాంటి దర్శకుడు.. బాలీవుడ్లో ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర పడ్డ తమన్నాతో ఎలాంటి సినిమా తీసి ఉంటాడన్నది ఆసక్తికరం.
తాజాగా రిలీజైన ‘బబ్లీ బౌన్సర్’ ట్రైలర్ మరీ గొప్పగా లేదు. అలా అని తీసిపడేసేలా కూడా లేదు. తమన్నా ఇందులో పంజాబీ పహిల్వాన్ పాత్రలో కనిపించడం విశేషం. చిన్నప్పట్నుంచి చదువు అబ్బక.. వెయిట్ లిఫ్టింగ్ లాంటి మగవాళ్ల క్రీడలో రాణిస్తూ మగరాయుడిలా పెరిగిన అమ్మాయి కథ ఇది. ఇంట్లోవాళ్లు పెళ్లీడు వచ్చిందని ఆమెకు సంబంధాలు చూడబోతే.. ఢిల్లీ వెళ్లి ఉద్యోగం చేస్తా అని పట్టుబడుతుంది. పదో తరగతి కూడా పాసవ్వలేకపోతున్న ఆమెకు బౌన్సర్‌గా ఉద్యోగం వస్తుంది.
మామూలుగా బౌన్సర్లంటే అబ్బాయిలే ఉంటారు కానీ.. తమన్నా లేడీ బౌన్సర్‌గా తన ప్రత్యేకత చాటుతుంది. ఈ పాత్రలో హీరోయిన్ ఎలివేషన్లు కూడా చూపించారు ట్రైలర్లో. చాలా వరకు వినోదాత్మకంగా సాగిన సినిమాలో ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే కొత్త అంశాలేమీ కనిపించలేదు. తమన్నాకైతే ఇది గుర్తుంచుకోదగ్గ పాత్ర అయ్యేలా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం తమన్నా సరికొత్త లుక్‌లోకి మారింది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా హాట్ స్టార్‌లో ఈ నెల 23న రిలీజ్ కాబోతోంది.
This post was last modified on September 5, 2022 4:07 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…