Movie News

మతిపోయే కథతో దుల్కర్ సినిమా

పేరుకి మలయాళ హీరో అయినా బాషల పరంగా దుల్కర్ సల్మాన్ ఎలాంటి సరిహద్దులు పెట్టుకోవడం లేదు. కథ నచ్చితే చాలు ఎవరికైనా ఓకే చెబుతున్నాడు. సబ్జెక్టులో వైవిధ్యం ఉండాలి అంతే. కొందరు సీనియర్ హీరోలే తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటే పట్టుమని పది టాలీవుడ్ మూవీస్ లేని దుల్కర్ కష్టపడి లాంగ్వేజ్ నేర్చుకుని మరీ తన గొంతునే వినిపిస్తున్నాడు.

ఇటీవలే వచ్చిన బ్లాక్ బస్టర్ సీతారామంలో క్లిష్టమైన పదాలను అలవోకగా పలికిన తీరు అందరి మెప్పు పొందింది. మ్యాటర్ లోకి వస్తే దుల్కర్ బాలీవుడ్ లో చేసిన కొత్త సినిమా చుప్ ది రివెంజ్ అఫ్ ది ఆర్టిస్ట్ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. ఆర్ బాల్కి దర్శకుడు. అక్షయ్ కుమార్ తో ప్యాడ్ మ్యాన్ – మిషన్ మంగళ్, అమితాబ్ బచ్చన్ తో పా – చీనికం, శ్రీదేవితో ఇంగ్లీష్ వింగ్లిష్ లాంటి క్లాసిక్స్ తీసిన వర్సటైల్ డైరెక్టర్. చుప్ తీసింది ఈయనే.

సరే ఇందులో విశేషం ఏముందంటారా. స్టోరీ లైన్ చాలా షాకింగ్ గా ఉంటుందట. సినిమాల రివ్యూలు రాసి తక్కువ రేటింగ్స్ ఇచ్చే వాళ్ళను చంపే ఒక సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడూ చూడని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చుప్ ని రూపొందించినట్టు చెబుతున్నారు. అతను ఎందుకు అలా చేస్తాడు, ఇండస్ట్రీకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా, ఇతనికి మరో కీలక పాత్ర పోషిస్తున్న సన్నీ డియోల్ కు కనెక్షన్ ఎలా సెట్ చేశారు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.

నిజంగానే ఎవరూ ట్రై చేయని పాయింట్ ఇది. అయినా రివ్యూలు ఇచ్చే వాళ్ళను మర్డర్ చేసే ఐడియా అసలు బాల్కికి ఎలా వచ్చిందో. ఏదో హాలీవుడ్ మూవీ ఇన్స్ పిరేషన్ అన్నారు కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది, దివంగత ఎస్డి బర్మన్ ట్యూన్లతో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులు ఈ సినిమాకు పని చేశారు. పూజా భట్, శ్రేయా ధన్వంతరి ఈ చుప్ లో ఇతర తారాగణం. తెలుగులోనూ డబ్ చేయబోతున్నారు.

This post was last modified on September 4, 2022 6:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago