ఇటివలే ప్రమోషన్స్ తో సినిమాను పీక్స్ కి తీసుకెళ్తూ తీరా థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి వీక్ కంటెంట్ చూపిస్తూ ఫ్లాప్స్ అందుకుంటున్నారు కొందరు ఫిలిం మేకర్స్. లైగర్ రిలీజ్ కి ముందు టీం చేసిన ప్రమోషన్స్, చెప్పిన మాటలకు సినిమాకు పొంతన లేదు. అందుకే ఆడియన్స్ మ్యాట్నీ కే సినిమాను తిప్పికొట్టారు. ఈ కోవలోకి తాజాగా ఓ చిన్న సినిమా కూడా చేరింది. సినిమా పేరు ఫస్ట్ డే ఫస్ట్ షో. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ -స్క్రీన్ ప్లే -మాటలు అందించిన ఈ సినిమాను ప్రమోషన్స్ తో ఆడియన్స్ కి బాగానే రీచ్ చేశారు.
అల్లు అరవింద్ తో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేసి హిలేరియస్ గా నవ్వించి తద్వారా మంచి ప్రమోషన్స్ చేసుకున్నారు టీం. అలాగే వెన్నెల కిషోర్ తో ఇంకో ఇంటర్వ్యూ చేసి దాన్ని కూడా వైరల్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా స్టార్ ని పిలిచి మరింత హంగామా చేశారు. ఇక ఇంటర్వ్యూలు , ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టీం చెప్పిన మాటలు విని ఇది మరో జాతిరత్నాలు అవుతుందేమో నని ఊహించారు ప్రేక్షకులు. ఆ భరోసాతోనే మొదటి రోజు మొదటి షో కి కొన్ని టికెట్లు తెగాయి. కానీ ఒక్కసారి థియేటర్స్ లోకి వెళ్ళాక టీం చేసిన ప్రమోషన్స్ గుర్తుచేసుకొని కంటెంట్ వీక్ ప్రమోషన్స్ పీక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.
నిజానికి కంటెంట్ ఉన్న సినిమాకు భారీ ప్రమోషన్స్ చేయనక్కర్లేదు. సినిమాలో దమ్ముంటే ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వస్తాయి. నిఖిల్ కార్తికేయ 2 సినిమానే ఇందుకు చక్కని ఉదాహరణ. ఆ సినిమాకు ఓ మోస్తారు ప్రమోషన్స్ మాత్రమే చేశారు. రిలీజ్ కి ముందు విడుదల చేసిన ట్రైలర్స్ మాత్రం బజ్ తీసుకొచ్చాయి. అవి చూసే ఆడియన్స్ సినిమాకు టికెట్లు కొన్నారు. అలా పెద్ద ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఆడియన్స్ ని కార్తికేయ 2 మెప్పించింది. ఫైనల్ గా నిర్మాతలకు మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టి 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చోటు సంపాదించుకుంది. సో కంటెంట్ మీద ఫోకస్ పెట్టకుండా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో వరకే ఆ హంగామా పనికొస్తుంది. అక్కడి నుండి కంటెంట్ మాత్రమే సినిమాను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది. ఇది అందరూ తెలుసుకోవాల్సిన సినిమా సత్యం.