పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు పర్మిషన్ రిజెక్ట్ చేసిన కారణం చేత ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం , వెంటనే టీం పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ అందరికీ తెలిసిందే.. ఫ్యాన్స్ కి అలాగే మీడియా కి ఎన్టీఆర్ సారీ కూడా చెప్పాడు. భారీ ఎత్తున జరగాల్సిన ఈవెంట్ ని ఇలా చిన్న వేదికపై చేయాల్సి వచ్చిందని డిజప్పాయింట్ అయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కోసం దాదాపు రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది.
రామోజీ ఫిలిం సిటీలో వేదిక ఫిక్స్ చేసుకొని ఈవెంట్ కంపనీ ఎనిమిది రోజుల క్రితమే పర్మిషన్ కి అప్లై చేసుకున్నారు. అది వచ్చే లోపు అంతా రెడీ చేసేసుకున్నారు. భారీ వేదిక, ఫైర్ వర్క్స్, బారీ కేడ్లు, ఎక్కువ సంఖ్యలో బౌన్సర్స్ ఇలా అంతా రెడీ చేసేశారు. అంతే కాదు రన్బీర్ కపూర్ చేతితో ఫైర్ క్రియేట్ అయ్యేలా సినిమా కాన్సెప్ట్ ని చెప్పేలా ఏదో భారీ గా ప్లాన్ చేశారు. అలాగే ఎన్టీఆర్ ని హైప్ చేసేందుకు నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ మాట్లాడే ముందు ఏదో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ మురిసిపోయేలా కూడా ప్లాన్ చేశారట.
నిన్న అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఈవెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ మర్చిపోలేని ఓ బెస్ట్ మెమొరీ అయ్యేదని అంటున్నారు. ఏమైనా గవర్నమెంట్ నుండి పర్మిషన్ రాకపోవడంతో అంతా వృధా అయింది. కొన్ని రోజులుగా నిద్ర తిండి పట్టించుకోకుండా కష్టపడిన అందరి కష్టం బూడిద పాలైంది. ఏదేమైనా ముంబై నుండి ఈవెంట్ కోసం విచ్చేసిన బ్రహ్మాస్త్ర టీం ని అలాగే ఎన్టీఆర్ ను పార్క్ హయత్ కి అప్పటి కప్పుడు షిఫ్ట్ చేసి ఈవెంట్ మెనేజ్మెంట్ తో కలిసి రాజమౌళి అండ్ టీం బాగానే సెట్ చేశారు. కానీ అనుకున్న విధంగా భారీ ఎత్తున ఆర్భాటంగా ఈవెంట్ చేయలేకపోయామనే బాధ మాత్రం రాజమౌళి, ఎన్టీఆర్, నాగార్జున మొహంలో కనిపించింది.
This post was last modified on September 3, 2022 10:18 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…