Movie News

బ్రహ్మాస్త్ర టికెట్ రేటు రూ.325

కొంత కాలంగా సినిమా టికెట్ల ధరల వ్యవహారం ఎంత చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి కదా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిమితికి మించి రేట్లు పెంచేయడం చేటు చేసింది. అసలే కొవిడ్ తర్వాత థియేటర్లకు రావడం తగ్గించేసిన ప్రేక్షకులు ఈ రేట్లు చూసి బెంబేలెత్తిపోయి మరింతగా వెండి తెరలకు దూరమయ్యారు.

తెలుగులో పెద్ద సినిమాలకు మల్టీప్లెక్సుల్లో రేటు రూ.300-400 మధ్య పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పెద్ద సినిమాలకు ఈ రేట్లు బాగా చేటు చేశాయి. ‘సర్కారు వారి పాట’ సరిగా ఆడకపోవడానికి, ‘ఆచార్య’ రెండో రోజు నుంచే అడ్రస్ లేకుండా పోవడానికి.. ‘వారియర్’ లాంటి సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ రాకపోవడానికి టికెట్ల రేట్లు పరోక్ష కారణం అనడంలో సందేహం లేదు. రోజు రోజుకూ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

గత నెలలో వచ్చిన సినిమాలన్నింటికీ చాలా వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 రేటు ఉండేలా చూశారు. ‘లైగర్’కు రేట్లు కొంచెం ఎక్కువ ఉండడం, పైగా డిజాస్టర్ టాక్ రావడం దెబ్బ కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’కు హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో రూ.325 రేటు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ చిత్రానికి ఆల్రెడీ దేశవ్యాప్తంగా బుకింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్‌లో ప్రధాన మల్టీప్లెక్సులు టికెట్ల అమ్మకాలు ఆరంభించాయి. వాటన్నింట్లో కూడా సినిమాకు రూ.325 రేటు ఫిక్స్ చేసి పెట్టేశారు.

దీనికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు కూడా కలిపితే రేటు రూ.360 దాకా అవుతోంది. ఇది భారీ బడ్జెట్ మూవీ కావడం, పైగా త్రీడీలో రిలీజ్ చేస్తుండడంతో ఈ రేటు నిర్ణయించినట్లున్నారు. నిర్మాతల వైపు నుంచి చూస్తే ఇది కరెక్ట్ రేటు అనిపింవచ్చు. కానీ ప్రేక్షకుల యాంగిల్లో చూస్తే మాత్రం ఈ రేటు చాలా ఎక్కువే. హిందీతో పాటు తెలుగు వెర్షన్‌కు కూడా ఇదే రేట్ ఫిక్స్ చేయడంతో మన ప్రేక్షకులు ఇంతింత రేటు పెట్టి ఒక అనువాద చిత్రాన్ని చూస్తారా అన్నది సందేహం. ఐతే సినిమాకు డీసెంట్ బజ్ ఉండడంతో బుకింగ్స్ అయితే ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ సినిమాకు మంచి టాక్ రాకపోతే మాత్రం ఈ రేట్లు చాలా చేటు చేసే ప్రమాదం ఉంది.

This post was last modified on September 3, 2022 4:27 pm

Share

Recent Posts

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…

59 minutes ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

1 hour ago

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన

బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…

2 hours ago

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

2 hours ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

3 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

4 hours ago