టాలీవుడ్లో కామెడీ బాగా చేయగల మాస్ హీరోల్లో రవితేజ ఒకడు. వెంకీ, విక్రమార్కుడు, ఆంజనేయులు లాంటి సినిమాల్లో రవితేజ చేసిన అల్లరిని ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. ఎంత ఫెరోషియస్ పాత్రలైనా బాగా చేసే రవితేజ.. కామెడీని కూడా అంత బాగా చేయగలడు.
ఐతే ఈ మధ్య కాలంలో రవితేజలోని ఈ బలాన్ని ఎవరూ సరిగా ఉపయోగించుకోవడం లేదు. అతను చేసిన మాస్ సినిమాలన్నీ వరుసగా తేడా కొడుతున్నాయి. ఇక వాటిలో కామెడీకి అసలే స్కోప్ ఉండట్లేదు. ఇలాంటి సమయంలో రవితేజలోని కామెడీ కోణాన్ని బాగా వాడుకునేలా ఓ కథ తయారు చేశాడట దర్శకుడు త్రినాథరావు నక్కిన. రామ్‌తో ‘హలో గురూ ప్రేమ కోసమే’ లాంటి హిట్ సినిమా తీసిన త్రినాథరావు.. ఆ తర్వాత మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు. మధ్యలో కొన్ని కాంబినేషన్లు కుదిరినట్లే కుదిరి పక్కకు వెళ్లిపోయాయి.
చివరికి రవితేజతో తన తర్వాతి సినిమాను ఓకే చేయించుకున్నాడు త్రినాథరావు. వీళ్లిద్దరూ కలిసి చేయబోయే సినిమా మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీస్‌లో ఒకటైన చంటబ్బాయి తరహాలో ఉంటుందని సమాచారం. ఆ సినిమా స్ఫూర్తితోనే ఓ కామెడీ కథను తీర్చిదిద్దాడట త్రినాథరావు. ఆయన ఆస్థాన రచయిత బెజవాడ ప్రసన్న కుమారే ఈ చిత్రానికి కూడా కథ అందించాడు.
రవితేజకు మంచి కామెడీ రోల్ పడితే ఎలా చెలరేగిపోతాడో చాలా సినిమాల్లో చూశాం. త్రినాథరావు కూడా కామెడీని పండించడంలో సిద్ధహస్తుడే. మరి వీళ్లిద్దరి కలయికలో రానున్న సినిమా ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మసాలా మూవీ క్రాక్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అతను రమేష్ వర్మతో ఇప్పటికే ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే.
This post was last modified on July 5, 2020 10:51 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…