ఇంకో 35 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ విడుదల కాబోతోంది. ఇటీవలే వదిలిన బర్త్ డే టీజర్ లో రిలీజ్ డేట్ అక్టోబర్ 5 కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇంకెలాంటి మార్పు ఉండకపోవచ్చు. కాకపోతే చేతిలో ఇంత తక్కువ టైం ఉన్నా ఇప్పటిదాకా ఒక్క లిరికల్ వీడియో వదల్లేదు. అదే రోజు రిలీజవుతున్న నాగార్జున ది ఘోస్ట్ ఆల్రెడీ ట్రైలర్ కట్ తో జనాన్ని ఇంప్రెస్ చేసింది. ఏదో విషయం ఉందన్న అభిప్రాయాన్ని బలంగా కలిగించింది. అది స్ట్రెయిట్ సబ్జెక్టు. అలాంటిది రీమేక్ అయిన గాడ్ ఫాదర్ ఇంకా అలెర్ట్ గా ఉండాలి.
అసలే ఆచార్య ఇచ్చిన మెగా షాక్ చిరుకే కాదు ఫ్యాన్స్ ని ఇప్పటికీ కోలుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు. అందుకే ఆ గాయాలన్నీ గాడ్ ఫాదర్ మాన్పుతుందననే నమ్మకంతో వాళ్లున్నారు. ఇందులో చిరుకి హీరోయిన్ లేదు.. జోడి కట్టి డాన్స్ చేసేందుకు ఛాన్స్ ఎక్కడ. సో సల్మాన్ ఖాన్ తో క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ కోసం దర్శకుడు మోహన్ రాజా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. తమన్ ట్యూన్ కి నృత్య దర్శకుడు ప్రభుదేవా కంపోజ్ ఈ ఒక్క పాటతో థియేటర్లు ఈగలు కేకలతో ఓ రేంజ్ లో దద్దరిల్లిపోతాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇదంతా వినడానికి బాగానే ఉంది కానీ గాడ్ ఫాదర్ ప్రమోషన్లతో మొదలుపెట్టి రిలీజ్ దాకా చేసుకోవాల్సిన ప్లానింగ్ చాలా ఉంది. ఏ మాత్రం నిర్లిప్తంగా ఉన్నా ఫలితాలు అటుఇటు అవుతాయి. ఆచార్య ఎంత డిజాస్టర్ అయినప్పటికీ తెల్లవారుఝామున కనీసం బెనిఫిట్ షోలు మొదలు కాకుండానే విపరీతమైన ప్రీ నెగటివ్ టాక్ బయటికి వచ్చేసి మొదటి రోజు కలెక్షన్లను చాలా డ్యామేజ్ చేసింది. చేస్తున్నదే ఆల్రెడీ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో సహా అందుబాటులో ఉన్న లూసిఫర్ రీమేక్. అలాంటిది ఆ తలంపే రాకుండా ఉండాలంటే రియల్ మెగాస్టార్ స్వాగ్ ని బయటికి తీయాలి. మరి మోహన్ రాజా ఏం చేయబోతున్నాడో లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on September 2, 2022 2:26 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…