Movie News

షాకింగ్ పాత్రల్లో కీర్తి సామ్

మహానటితో మహా ఇమేజ్ సాధించుకున్న కీర్తి సురేష్ కు ఆ తర్వాత కెరీర్ సక్సెస్ రేట్ పరంగా ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈ ఏడాది గుడ్ లుక్ సఖి డిజాస్టర్ కాగా మహేష్ బాబుతో మొదటిసారి జోడి కట్టిన సర్కారు వారి పాట సైతం మరీ బ్లాక్ బస్టర్ అయితే కాలేకపోయింది. ప్రైమ్ ఓటిటి కోసం చేసిన చిన్ని(సాని కడియం) పెర్ఫార్మన్స్ పరంగా పేరు తీసుకొచ్చిందే తప్ప దానికొచ్చిన ఫీడ్ బ్యాక్ సైతం సోసోనే.

నేను లోకల్ తర్వాత నానితో చేస్తున్న దసరా, చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న భోళా శంకర్ మాత్రమే తన చేతిలో ఉన్నాయి. ఇక విషయానికి వస్తే తమిళ స్టార్ హీరో విజయ్ సరసన కీర్తి మరోసారి జంటగా నటించబోతున్నట్టు చెన్నై అప్డేట్. మాస్టర్ – విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ డ్రామాకు తన పేరే పరిశీలనలో ఉందట. కాకపోతే భార్యగా తక్కువ లెన్త్ తో ఫ్లాష్ బ్యాక్ లో ఉండొచ్చని అంటున్నారు.

గతంలో విజయ్ తో చేసిన సినిమాలు ఒకటి భైరవ రెండోది సర్కారు కమర్షియల్ గా సక్సెస్ అయినవే. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం కాంబో అవుతున్నారు. విక్రమ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ తో మంచి జోష్ మీదున్న లోకేష్ ఈసారి మాస్టర్ ని మించిన హై ఎండ్ ఎంటర్ టైనర్ ఇవ్వాలని పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఇందులోనే మరో ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్టులోనే సమంతా కూడా ఉంటుందట.

అయితే తనది కొంచెం నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని.. ఫ్యామిలీ మ్యాన్ 2 తరహాలో డిఫరెంట్ గా చూపిస్తారని వినికిడి. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా దాదాపు అంగీకారానికి వచ్చినట్టేనని చెబుతున్నారు. యశోద, శాకుంతలంలు పూర్తి చేసి విడుదల కోసం ఎదురు చూస్తున్న సమంతా ఛాలెంజింగ్ గా అనిపించే పాత్రలకు మాత్రమే ఎస్ చెబుతోంది. మరి లోకేష్ కనగరాజ్ అంతటి వాడు అడిగితే కాదనే ఛాన్స్ ఉంటుందా. ఏమో చూద్దాం. సామ్ కీర్తి కలిసి నటించిన వాటిలో సీమరాజా, మహానటి లాంటి హిట్లున్నాయి.

This post was last modified on August 31, 2022 10:32 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

1 hour ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

4 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

4 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

5 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

6 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

6 hours ago