సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పట్నుంచో ఫేస్‌బుక్‌లో ఉంటున్నాడు కానీ.. అంత యాక్టివ్ ఏమీ కాదు. ఈ మధ్య తన తండ్రి చిరంజీవి ట్విట్టర్లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో.. కొన్ని రోజులకే చరణ్ కూడా ఆ మాధ్యమంలోకి వచ్చాడు. కానీ చిరులా వరుసబెట్టి ట్వీట్లు ఏమీ వేసేయట్లేదు.
ఏదో నామమాత్రంగా ట్విట్టర్లో ఉన్నానంటే ఉన్నాను అనిపిస్తున్నాడు. రెగ్యులర్‌గా అప్ డేట్లు ఏమీ ఇచ్చే అలవాటు లేదు చరణ్‌కు. అలాంటిది ఆదివారం ఒక ఆసక్తికర ట్వీట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు మెగా పవర్ స్టార్.
When u seek revenge violent or non-violent, we are just revolving ,not evolving.
హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.
-Edith Eva Eger: The Choice
ఇదీ రామ్ చరణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన మెసేజ్. దీనితో పాటు వినయ విధేయ రామలో ఒంటిపై పచ్చబొట్లతో ఫెరోషియస్ లుక్‌తో కనిపించే ఫొటో ఒకటి.. మరో క్లోజప్ ఫొటో కూడా షేర్ చేశాడు చరణ్. మార్గం ఏదైనా సరే.. ప్రతీకారం తీర్చుకోవడం మీద దృష్టిపెడితే మనం ఎదగలేం అని చరణ్ చెప్పే ప్రయత్నం చేశాడు.
ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ వార్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. అలాంటివి వద్దని తన అభిమానులకు చరణ్ చెబుతున్నట్లే ఉంది ఈ ట్వీట్ చూస్తే. కాకపోతే అతను షేర్ చేసిన ఫొటో తాలూకు సినిమా ప్రతీకారం నేపథ్యంలోనే నడుస్తుందన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 5, 2020 6:47 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…