తిరు చిత్రాంబళం.. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త సినిమా ఇది. ఈ నెల 18న ఓ మోస్తరు అంచనాలతో రిలీజైందీ చిత్రం. ధనుష్ గత సినిమాలు వరుసగా ఫెయిలవడం.. అలాగే ఈ సినిమాను డైరెక్ట్ చేసిన మిత్రన్ జవహార్ ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నీ రీమేక్‌లే కావడంతో ఈ సినిమాపై మరీ అంచనాలేమీ లేవు. ట్రైలర్ చూస్తే వీఐపీ (తెలుగులో రఘువరన్ బీటెక్) స్టయిల్లో కనిపించింది. ఐతే ఈ చిత్రానికి రివ్యూలు మాత్రం చాలా పాజిటివ్‌గా వచ్చాయి.
కొన్నాళ్లుగా తమిళంలో సరైన సినిమాలు లేకపోవడం, బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా బాగా కలిసి రావడంతో ఈ ఊహించని రేంజికి వెళ్లిపోయింది. రోజు రోజుకూ వసూళ్లు పెరుగుతూ వెళ్లాయి. రూ.25 కోట్లు, 50 కోట్లు, 75 కోట్లు.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుతూ ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని కూడా దాటేసిందీ చిత్రం. విజయ్ లాంటి టాప్ స్టార్ సినిమా అయిన ‘బీస్ట్’ వసూళ్లను ఇది దాటేసింది.
‘బీస్ట్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విజయ్ రేంజికి తగ్గట్లు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. అంత భారీ చిత్రం కలెక్షన్లను పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘తిరుచిత్రాంబళం’ దాటేయడం విశేషం. వసూళ్ల పరంగా ధనుష్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ చిత్రంలో ధనుష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా ఒక సామాన్యమైన పాత్ర చేశాడు. ఐతే ఇలాంటి పాత్రలే అతడి బాగా సూటవుతాయని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. తన పాత్రతో మిడిల్ క్లాస్ జనాలు బాగా కనెక్ట్ అయ్యారు.
చాన్నాళ్ల తర్వాత ‘వీఐపీ’ తరహా ప్లెజెంట్ మూవీ చూశామని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ధనుష్‌కు తోడు.. నిత్యామీనన్ పెర్ఫామెన్స్ కూడా అదిరిపోవడం, ఆహ్లాదకరమైన సన్నివేశాలకు తోడు అనిరుధ్ పాటలు కూడా పెద్ద ప్లస్ కావడంతో సినిమా ఊహించని రేంజికి వెళ్లిపోయింది. రెండో వారంలోనూ సినిమా హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. ఈ చిత్రం ‘తిరు’ పేరుతో తెలుగులోనూ రిలీజైంది కానీ.. సీతారామం, బింబిసార, కార్తికేయ-2, లైగర్ హడావుడి మధ్య దీన్ని మన జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
This post was last modified on August 30, 2022 9:29 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…