ఆమిర్ ఖాన్ అంటే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ హీరోల్లో ఒకడు. లగాన్, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో భారతీయ సినిమా వసూళ్ల రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు తిరగరాస్తూ వచ్చిన హీరో అతను. అలాంటి హీరో నుంచి వచ్చిన కొత్త చిత్రం లాల్ సింగ్ చడ్డాకు ఫుల్ రన్లో రూ.50 కోట్లకు మించి వసూళ్లు రాకపోవడం పెద్ద షాక్. ఈ సినిమాకు వ్యతిరేకంగా విడుదల ముంగిట జరిగిన ప్రతికూల ప్రచారం సంగతి తెలిసిందే.
ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఒక వర్గం తీవ్ర స్థాయిలో నెగెటివిటీని స్ప్రెడ్ చేసింది. ఆమిర్ ఖాన్ మీడియా సమావేశాల్లో ఎంతో వినమ్రంగా మాట్లాడే ప్రయత్నం చేసినా, తన సినిమాను బాయ్‌కాట్ చేయొద్దని కోరినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉంటే మరికొందరు బాలీవుడ్ స్టార్లు తమ సినిమా ప్రమోషన్ల సందర్భంగా మాట్లాడిన మాటలు సినిమాకు ఉపయోగపడకపోగా.. ఇంకా నెగెటివ్ అయ్యాయి.
మొత్తంగా పరిస్థితి చూస్తే ప్రమోషన్ల వల్ల జరిగే మేలు కంటే చేటే ఎక్కువ ఉంటోందన్న ఆలోచనలో పడిపోయింది బాలీవుడ్. ఈ క్రమంలోనే కొందరు బాలీవుడ్ స్టార్లు తమ సినిమాలను ప్రమోట్ చేయడానికే వెనుకంజ వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. షారుఖ్ ఖాన్ కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అతడి సినిమా పఠాన్‌ను సైతం బాయ్‌కాట్ చేయాలని ఇప్పటికే సోషల్ మీడియాలో ఉద్యమం నడిచింది. ఆ సినిమా రిలీజ్ టైంలో కచ్చితంగా దాన్ని టార్గెట్ చేస్తారన్నది స్పష్టం.
పఠాన్‌ను ప్రమోట్ చేయడం కోసం తాను మీడియాలో కనిపిస్తే ఈ బాయ్‌కాట్ బ్యాచ్‌కు ఇంకా కోపం రావచ్చని.. ఓవరాల్‌గా కూడా హిందీ ప్రేక్షకుల మూడ్ సరిగా లేని నేపథ్యంలో ప్రమోషన్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని.. దీని బదులు సినిమానే ఎక్కువ మాట్లాడేలా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా చేయడం మంచిదని.. టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలను ఎగ్జైటింగ్‌గా తీర్చిదిద్దుకుని ప్రమోషన్లకు దూరంగా ఉండమే మేలనే అభిప్రాయానికి షారుఖ్ అండ్ కో వచ్చిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
This post was last modified on August 30, 2022 11:42 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…