బాయ్‌కాట్.. బాయ్‌కాట్.. బాయ్‌కాట్.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాలీవుడ్ సినిమాలకు సంబంధించి తరచుగా వినిపిస్తున్న మాట ఇది. ఎప్పటెప్పటి విషయాలను బయటికి తీసి.. ఇప్పుడు రిలీజవుతున్న సినిమాలకు ముడిపెట్టి.. వాటిని బాయ్‌కాట్ చేయాలని హిందీ ప్రేక్షకుల్లో కొన్ని వర్గాలు రాద్దాంతం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. అసలే కొవిడ్ తర్వాత బాలీవుడ్ సినిమాల పరిస్థితి దారుణంగా తయారైంది.
లైగర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ ఈ బాయ్‌కాట్ బ్యాచ్‌కు కౌంట్ ఇవ్వడంతో నెమ్మదిగా ఈ ఎఫెక్ట్ సౌత్ సినిమాల మీద కూడా పడే ప్రమాదం కనిపించింది. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం కోబ్రా సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విక్రమ్‌కు మీడియా వాళ్ల నుంచి సంబంధిత ప్రశ్న ఎదురైంది. ఈ మధ్య వరుసగా సినిమాలను బాయ్‌కాట్ బాయ్‌కాట్ అంటున్నారు కదా.. దాని మీద మీ స్పందనేంటి అని ఒక విలేకరి విక్రమ్‌ను ప్రశ్నించాడు.
దీనికి విక్రమ్ ఇచ్చిన సమాధానం మాస్టర్ క్లాస్ అనే చెప్పాలి. ముందు తనకు అసలు ప్రశ్న అర్థం కాలేదన్నట్లు చెప్పిన విక్రమ్.. తర్వాత విలేకరి వివరించే ప్రయత్నం చేయగా.. బాయ్‌కాట్ అంటే ఏంటో తనకు తెలియదని అన్నాడు విక్రమ్. బాయ్ అంటే తెలుసని, గర్ల్ అంటే తెలుసని, అలాగే కాట్ అన్నా కూడా తెలుసని.. కానీ బాయ్‌కాట్ అంటే ఏంటో మాత్రం తనకు తెలియదని నవ్వేశాడు విక్రమ్.
అతడి సమాధానానికి ఆడిటోరియంలో ఉన్న వాళ్లందరూ కూడా గొల్లుమన్నారు. ఇక తాను, తన కొడుకు కలిసి నటించిన ‘మహాన్’ చిత్రాన్ని థియేటర్స్‌లో చూడాలనుకున్నానని.. కరోనా వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో దాన్ని ఓటీటీలో విడుదల చేశామని… ఆ విషయంలో తాను బాధపడ్డా ఫర్వాలేదని. భవిష్యత్తులోతామిద్దరం మరోసారి కలిసి నటిస్తామని విక్రమ్ అన్నాడు.
This post was last modified on August 29, 2022 12:09 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…