ఇప్పుడు ఇండియా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తన్న సీక్వెల్ అంటే పుష్ప-2నే. గత ఏడాది డిసెంబర్లో రిలీజైన పుష్ప-ది రైజ్ ఎంత పెద్ద హిట్టయిందో, పుష్ప-ది రూల్ మీద ఎంతగా అంచనాలు పెంచిందో తెలిసిందే. ఆ అంచనాలను అందుకోవడానికి సుకుమార్ అండ్ టీం మరింత కష్టపడుతోంది. స్క్రిప్టు మీద చాలా సమయం వెచ్చించడం వల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి మొదలు కాలేదు.
ఐతే ఇటీవలే పూజా కార్యక్రమం పూర్తి చేయగా సెప్టెంబరులో చిత్రీకరణ మొదలైపోతుందని సమాచారం. సీక్వెల్లో ఫాహద్ ఫాజిల్ ప్రధాన విలన్ అవుతాడని, అతడితో బన్నీ పోరు నేపథ్యంలోనే ప్రధానంగా కథ నడుస్తుందని అందరికీ అంచనా ఉంది. ఈ దిశగా పుష్ప క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చి వదిలేశాడు సుక్కు.
ఫాహద్‌కు తోడు సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, ధనంజయ.. ఇలా బన్నీని టార్గెట్ చేసే విలన్ల సంఖ్య పెద్దదే. ఐతే వీరు సరిపోరని ఇంకో విలన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నట్లు సమాచారం. పుష్ప-1లో బన్నీకి అండగా ఉండే ఎంపీ పాత్రలో రావు రమేష్ కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం సిండికేట్ మొత్తం పుష్ప చేతిలో పెట్టి తెర వెనుక నడిపిస్తుంటాడతను. ఐతే పార్ట్-2లో ఈ పాత్రకు ఎదురు నిలిచి పుష్పను ఇబ్బంది పెట్టే ఇంకో పొలిటీషియన్ పాత్ర ఉంటుందట.
అతను, ఫాహద్ కలిసి బన్నీకి సవాలు విసురుతారట. ఈ పాత్రకు పేరున్న నటుడినే తీసుకోవాలన్నది సుకుమార్ ఆలోచన. బన్నీ సరైనోడు మూవీలో విలన్‌గా నటించిన ఆది పినిశెట్టితో పాటు మరికొందరిని ఈ పాత్రకు పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. త్వరలోనే నటుడిని ఖరారు చేసి అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.
This post was last modified on August 29, 2022 12:06 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…