ఈ మధ్య పాన్ ఇండియా బిల్డప్ తో వచ్చిన సినిమాల్లో అధిక శాతం డిజాస్టర్లు కావడం బాలీవుడ్ ని విపరీతంగా కలవరపెడుతోంది. కంటెంట్ దారుణంగా ఉండటం ఒక కారణమైతే మొదటి వారం రావాల్సిన కనీస వసూళ్లను బాయ్ కాట్ బ్యాచులు మింగేయడం ఎగ్జిబిటర్లను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. మొన్నామధ్య ఓ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఈ అంశం గురించి విజయ్ దేవరకొండ మీద ఓ వీడియోలో తీవ్రంగా కామెంట్లు చేయడం, రౌడీ హీరో స్వయంగా వెళ్లి అతన్ని కలిసి క్లారిటీ ఇచ్చి ఫోటో దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సరే ఇదంతా ఎంత చేసినా లైగర్ ఇప్పటికిప్పుడు పికప్ అయ్యే ఛాన్స్ లేదు కానీ దీనికన్నా ముందు లాల్ సింగ్ చడ్డా విషయంలో అమీర్ ఖాన్ ఎదురుకున్న చేదు అనుభవాలు కొన్నేళ్లపాటు మాట్లాడుకునేలా జరిగాయి. ఇక్కడితో అయిపోలేదు. వచ్చే నెల సెప్టెంబర్ 9న విడుదల కానున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ మీద బాయ్ కాట్ నీలినీడలు కమ్ముతున్నాయి. అలియా భట్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నన్ను చూస్తే చూడండి లేకపోతే లేదు అని బిరుసుగా మాట్లాడ్డం, ప్రెసిడెంట్ అఫ్ ఇండియా ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వీటికి తోడు నెపోటిజం ఇష్యూలో టార్గెట్ గా ఉంటూ వస్తున్న రన్బీర్ కపూర్, కరణ్ జోహార్ లు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆ ఆజ్యానికి మరింత నిప్పుని రాజేస్తోంది. అసలే బ్రహ్మాస్త్రకు ఆశించిన స్థాయిలో బజ్ లేదని నిర్మాతలు కిందామీదా పడుతున్నారు. సమర్పకులుగా ఉన్న రాజమౌళి ఏదో తోడ్పాటు అందిస్తున్నారు కానీ అదెంతవరకు పని చేస్తుందో చెప్పలేం. బాహుబలిని మ్యాచ్ చేసే రేంజ్ లో ఇది అంచనాలు పెంచుతుందనుకుంటే ఇలా జరగడం టీమ్ ని కలవరపెడుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా నార్త్ ఇండస్ట్రీ తిరిగి జనవరిలో వచ్చే షారుఖ్ ఖాన్ పఠాన్ దాకా కోలుకోవడం కష్టం. అదే జరిగితే అప్పటిదాకా సౌత్ సినిమాలే ఊపిరినివ్వాలి.
This post was last modified on August 28, 2022 9:09 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…