ఇంకో మూడు రోజుల్లో వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న కోబ్రా మీద తెలుగులో పెద్ద అంచనాలేం లేవు. అందుకే హీరో విక్రమ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి(హీరోయిన్)తో సహా టీమ్ మొత్తం పాల్గొనగా హైదరాబాద్ వేదికగా ప్రత్యేకంగా మీడియా మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విక్రమ్ చాలా చలాకీగా తెలుగులో మాట్లాడుతూ సినిమా మీద గట్టి నమ్మకమే వ్యక్తం చేశాడు. అపరిచితుడు టైంలో వచ్చిన మార్కెట్ తర్వాత తగ్గిపోయిందనే వాస్తవాన్ని ఒప్పుకుంటూనే కోబ్రాతో అది తిరిగి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
రకరకాల గెటప్పులతో అచ్చం దశావతారంలో కమల్ హాసన్ తరహాలో చాలా మేకప్పులు ట్రై చేసిన విక్రమ్ ఇవన్నీ కథలో భాగమే అంటున్నాడు. ఒక లెక్కల టీచర్ కోబ్రా అనే మారుపేరుతో చేసే సంచలనాత్మకమైన పనులే ఇందులో మెయిన్ పాయింట్. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుకు యాక్షన్ థ్రిల్లర్స్ ని డీల్ చేయడంలో మంచి పనితనం ఉంది. డెబ్యూ మూవీ డెమోంటీ కాలనీ తెలుగులోనూ బాగానే ఆడింది. రెండోది నయనతార అంజలి సిబిఐ. కమర్షియల్ గా పే చేయకపోయినా ఓటిటిలో వచ్చాక ప్రశంసలు దక్కాయి.
ఇప్పుడీ కోబ్రా మూడోది. అసలే మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా. డబ్బింగ్ మూవీని అంత లెంత్ తో మన ఆడియన్స్ చూస్తారా అంటే చాలా బలమైన ఎంగేజింగ్ కంటెంట్ ఉంటే తప్ప చెప్పలేం. ఏఆర్ రెహమాన్ సంగీతం సైతం మ్యూజిక్ లవర్స్ లో పూర్తి స్థాయిలో రిజిస్టర్ అవ్వలేదు. శ్రీనిధి ఉందన్న అంశం కూడా హైలైట్ కాలేకపోయింది. 2005లో వచ్చిన అపరిచితుడు తర్వాత తెలుగులో విక్రమ్ కు ఆ స్థాయిలో చెప్పుకునే పెద్ద హిట్టు పడలేదు. మహా అయితే యావరేజ్ లున్నాయి అంతే. పోటీ లేని మంచి టైం చూసుకుని వస్తున్న కోబ్రా ఆ అవకాశాన్ని ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి.
This post was last modified on August 28, 2022 9:01 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…