ఒక సినిమాకు అనివార్య కారణాలతో ఒకసారి టైటిల్ మార్చిన ఉదంతాలు చాలానే కనిపిస్తాయి. తెలుగులో అర్జున్ సురవరం, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాలకు చివరి దశలో టైటిళ్లు మారిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా కొన్ని సినిమాలకు ఇలా జరిగింది. కానీ ఇప్పుడో సినిమాకు మూడోసారి టైటిల్ మారడం విశేషం. ఆ సినిమా సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్‌ది కావడం గమనార్హం.
గతంలో రచయితగా పని చేసి, ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎంటర్టైన్మెంట్, హౌస్ ఫుల్-3, హౌస్ ఫుల్-4, బచ్చన్ పాండే లాంటి చిత్రాలను రూపొందించిన ఫర్హద్ సాంజి దర్శకత్వంలో సల్మాన్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే టైటిల్ పెట్టారు. ఐతే దేశంలో మతానికి సంబంధించిన వ్యవహారాలు మరీ సున్నితంగా మారిపోయిన నేపథ్యంలో ఈ టైటిల్ వల్ల హిందు, ముస్లింల మధ్య లేని వివాదాన్ని సృష్టించినట్లు అవుతుందేమో అని ఆ టైటిల్‌పై వెనక్కి తగ్గారు.
ఆ తర్వాత తన బ్లాక్‌బస్టర్ మూవీ ‘భజరంగి భాయిజాన్’ నుంచి సగం తీసి ‘భాయిజాన్’ అనే టైటిల్ పెట్టాలని సల్మాన్ ఖాన్ అనుకున్నాడు. కొన్ని నెలల నుంచి ఈ వర్కింగ్ టైటిల్‌తోనే సినిమాను షూట్ చేస్తున్నారు. కానీ ఆ టైటిల్ రిపిటీటివ్‌గా ఉంటుందని భావించి ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేశారు. చివరగా ‘కిసీ కా భాయ్.. కిసీ కా జాన్’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేశారు.
తాను బాలీవుడ్లోకి అడుగు పెట్టి 34 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సల్మాన్ ఈ టైటిల్‌తో పాటు సినిమాలో తన ఫస్ట్ లుక్‌ను కూడా లాంచ్ చేశాడు. జులపాల జుట్టుతో సల్మాన్ కొంచెం భిన్నంగా కనిపించబోతున్నాడీ సినిమాలో. టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా నటిస్తుండగా.. మన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. అంతే కాక జగపతిబాబు సైతం ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ ఏడాది డిసెంబరు 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on August 27, 2022 4:19 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…