అమరావతి రాజధాని విషయంలో వైసీపీ అనుసరించిన వ్యూహం.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారింది. రాజధానిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. అమరావతిని శాసన రాజధానిగా మాత్రమే చూస్తామని.. దీనికి బదులుగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తామని.. జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. అమరావతినే రాజధానిగా ఉంచాలని .. హైకోర్టు ఆదేశించిన దరిమిలా.. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు.
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయలా.. లేక సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలా అనే అంశంపై సర్కారు తేల్చుకోలేక పోతోంది. రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు.. తీర్పు ఇచ్చిన నాటి నుంచి మూడు నెలల్లో అన్ని మౌలిక వసతులతో నివాసయోగ్యమైన ప్లాట్లు ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై రాజధాని రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు సర్కారుకు ఇబ్బందిగా మారాయి.
దీనికి సంబందించి ఇప్పటికే.. గడువును ఐదేళ్లకు పెంచాలని కోరారు. అయితే.. దీనిని సర్కారు సుప్రీంలో సవాల్ చేయలేదు. కొందరు పిటిషనర్ల తరఫున పడిన పిటిషన్లకు అనుబంధంగానే ప్రభుత్వం కోర్టులోఈ వాదన వినిపించింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలు ఉంటాయి. కాబట్టి.. ఎస్‌ఎల్‌పీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై ఏం చేయాలనేది ప్రభుత్వానికి మింగుడు పడని విషయంగా మారిపోయింది.
మరోవైపు.. ఈ వివాదం ఇలా కొనసాగుతుంటే.. మూడు రాజధానుల విషయం మాత్రం ఎటూ తేలకుండా పోయింది. విశాఖలో రేపు దసరా నాటికి సీఎం పాలన ప్రారంభిస్తారని.. తాడేపల్లి వర్గాలు లీకులు ఇస్తున్నా.. అది కూడా సాధ్యం కాదని.. తెలుస్తోంది. ఎందుకంటే.. కోర్టులో ధిక్కరణ వ్యాజ్యాలకు అనుకూలంగా తీర్పు వస్తే.. ఇబ్బందులు తప్పవని.. కాబట్టి.. విశాఖకు ఇప్పుడు వెల్లడం కంటే.. ఎన్నికల సమయంలో మూడు రాజధానులను మేనిఫెస్టోలో చేర్చి అప్పుడే తేల్చుకుంటే బెటర్ అనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on August 27, 2022 2:04 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…