ఏదో రెండు మూడు సినిమాలతో ఆగిపోతుందనుకున్న పాత సినిమాల రీ రిలీజుల ట్రెండ్ ఇకపై క్రమం తప్పకుండ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వీటిని హీరోల పుట్టినరోజులకు పరిమితం చేశారు కానీ రాబోయే కాలంలో బ్లాక్ బస్టర్ల యానివర్సరీలకు సైతం స్పెషల్ ప్రీమియర్లు వేసేలా ఉన్నారు. ఆ మధ్య మహేష్ బాబు బర్త్ డేకు ఒక్కడు వేస్తే హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. పోకిరికి ఏకంగా కోటి డెబ్భై లక్షలకు పైగా గ్రాస్ వచ్చింది. ముప్పై ఏళ్ళ వయసున్న ఘరానా మొగుడుకి సైతం చాలా చోట్ల మంచి వసూళ్లు దక్కాయి.
ఇప్పుడు సెప్టెంబర్ 2 జనసేనాని పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. ఆల్రెడీ జల్సాని రీ మాస్టర్ చేసి స్పెషల్ షోల కోసం సిద్ధం చేసి ఉంచారు. ముందు రెండో తేదీ అన్నారు కానీ ఇప్పుడది ఒకటికే వచ్చింది. టీవీలో యూట్యూబ్ లో అన్నేసి సార్లు చూసినా కూడా 4K రెజోల్యూషన్ లో ఎంజాయ్ చేయాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు తమ్ముడుని కూడా తెస్తున్నారు. ఆగస్ట్ 31 వినాయక చవితి పండగ సందర్భంగా పవర్ స్టార్ అడ్వాన్స్ విషెస్ అంటూ ఆల్రెడీ పోస్టర్లు గట్రా పంచుతున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో బుకింగ్ కూడా మొదలైపోయింది.
ఇలా ఒకే హీరోవి రెండు సూపర్ హిట్లు క్లాష్ చేయడం విచిత్రంగా ఉంది. నోస్టాల్జియా ఫీలింగ్ కోసం ప్రేక్షకులు బాగానే వెళ్తున్నారు కానీ ఇంత తక్కువ గ్యాప్ లో కొత్త సినిమాలకు వసూలు చేసే టికెట్ రేట్లతోనే వీటిని ప్రదర్శించడం సగటు మధ్య తరగతి అభిమానులను ఇబ్బంది పెడుతోంది. 1999లో విడుదలైన తమ్ముడు అప్పట్లో అదిరిపోయే హిట్టు కొట్టింది. అమీర్ ఖాన్ జో జీతా వహి సికందర్ ఫ్రీమేక్ గా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో రమణ గోగుల పాటలు, పవన్ కామెడీ ఓ రేంజ్ లో పేలాయి. అరుణ్ ప్రసాద్ దర్శకత్వానికి మంచి పేరు వచ్చింది. చూస్తుంటే ఆ రెండు రోజులు పవన్ ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండేలా కనిపించడం లేదు.
This post was last modified on August 27, 2022 5:59 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…