Movie News

ప్రభాస్-మారుతి.. భయంతోనే ఇలా..

ఓవైపు గురువారం సోషల్ మీడియా అంతటా ‘లైగర్’ నామస్మరణ జరుగుతుంటే.. మరోవైపు చడీచప్పుడు లేకుండా ఒక పెద్ద సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక జరిగిపోయింది టాలీవుడ్లో. అది ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించబోయే సినిమా. సందేహాలకు, సస్పెన్సుకు తెరదించుతూ ఈ సినిమా అధికారికంగా మొదలైపోయింది. ఈ సినిమా గురించి వార్త బయటికి వచ్చినప్పటి నుంచి రకరకాల సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి.

ఆల్రెడీ ఇద్దరు యువ దర్శకులకు ఛాన్స్ ఇచ్చి ‘బాహుబలి’ తర్వాత రెండు పెద్ద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. మారుతి లాంటి ఫామ్‌లో లేని, తన రేంజికి తగని దర్శకుడితో సినిమా చేయడం అవసరమా అన్నది అభిమానుల ప్రశ్న. అందులోనూ అతడి లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’ డిజాస్టర్ కావడంతో వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. గురువారం ఈ చిత్రానికి ముహూర్తం అనగానే మారుతిని ఇండస్ట్రీ నుంచే బాయ్‌కాట్ చేయాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నిన్నట్నుంచి పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ వ్యతిరేకత చూసి టీం భయపడిందని, ముహూర్త కార్యక్రమాన్ని ఆపేస్తున్నారని బుధవారం సాయంత్రం ప్రచారం జరిగింది. కానీ ఉదయానికి కథ మారిపోయింది. ముందు అనుకున్నట్లే ముహూర్త కార్యక్రమం జరిపించేశారు. కానీ దీనికి మీడియాను పిలవలేదు. ఇండస్ట్రీ నుంచి కూడా అతిథులెవరూ రాలేదు. నామమాత్రంగా కార్యక్రమం ముగించారు. ఈ ప్రారంభోత్సవం గురించి మీడియాకు ప్రెస్ నోట్ ఇవ్వలేదు.

సోషల్ మీడియాలో కూడా ఎలాంటి అధికారిక పోస్టులు, ఫొటోలు కూడా ఏవీ పెట్టే ఉద్దేశాలు లేనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభాస్ అభిమానులున్న కోపం చూస్తే.. ఈ పోస్టులు పెట్టడం వారిని రెచ్చగొట్టడమే అవుతుందని, వాళ్లు అదుపు తప్పొచ్చని భావించినట్లున్నారు. అందుకే ముహూర్త వేడుక గురించి గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

స్క్రిప్టు లాక్ అయి, ప్రభాస్ కమిట్మెంట్ ఇవ్వడమే కాక డేట్లు కూడా కేటాయించి, నిర్మాత ఓకే అయ్యాక సినిమా విషయంలో వెనక్కి ఎందుకు తగ్గుతారన్నది ఇక్కడ ప్రశ్న. కాకపోతే సినిమా గురించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి, కంటెంట్‌తోనే సమాధానం చెప్పాలని చిత్ర బృందం ఆలోచన కావచ్చు. ప్రాజెక్ట్-కే, సలార్ చిత్రాల్లో నటిస్తూనే వీలు చిక్కినపుడల్లా ఈ చిత్రానికి కొన్ని డేట్లు సర్దుబాటు చేస్తాడట ప్రభాస్. ఇందులో అతడి సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని సమాచారం.

This post was last modified on August 26, 2022 5:13 pm

Share

Recent Posts

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

43 minutes ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

1 hour ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

3 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

4 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

6 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

6 hours ago