మైక్ టైసన్.. ప్రపంచ కిక్ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ఆకర్షణ కలిగిన, ఎంతో చర్చనీయాంశంగా మారిన పేరు. సంచలన ఆటకు తోడు వివాదాలతో అతను తన కెరీర్ ఆద్యంతం వార్తల్లో వ్యక్తిగానే ఉన్నాడు. ఆట నుంచి తప్పుకున్నాక కూడా టైసన్ తరచుగా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అతడి పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి దిగ్గజం మన విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ల కలయికలో తెరకెక్కిన ‘లైగర్’ మూవీలో ఓ పాత్ర చేస్తున్నాడని వెల్లడైనపుడు అందరూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.
ఇది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా భావించారు. ‘లైగర్’ ట్రైలర్లో ‘‘ఇఫ్ యు ఆర్ ఎ ఫైటర్.. దెన్ హు యామ్ ఐ’ అంటూ టైసన్ చెప్పిన డైలాగ్ ఆసక్తి రేకెత్తించింది. సినిమా పోస్టర్లలోనూ టైసన్‌ను చూసి ఎంతో ఊహించుకున్నారు జనాలు. సినిమా మీద అంచనాలు పెరగడానికి టైసన్ కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు.
ఐతే ఇప్పుడు తెర మీద టైసన్‌ను ప్రెజెంట్ చేసిన తీరు చూసి ప్రేక్షకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. టైసన్‌కు, విజయ్‌కి ఏదైనా రిలేషన్ పెట్టి హీరోను ఇన్‌స్పైర్ చేసే పాత్రలో టైసన్ కనిపిస్తాడని అనుకుంటే.. అతణ్ని విలన్ని చేసి పడేశారు. పోనీ ఆ పాత్ర అయినా సీరియస్‌గా ఉందా అంటే అదీ లేదు. మొహమాటపడకుండా చెప్పాలంటే టైసన్‌ది జోకర్ టైపు క్యారెక్టర్. హీరోయిన్ని కిడ్నాప్ చేసి తనకు రావాల్సిన డబ్బులు డిమాండ్ చేసే క్యారెక్టర్ అతడిది.
హీరో వెళ్లి అతడితో ఫైట్ చేసి మరీ కామెడీగా అతణ్ని కింద పడి కొట్టేసి తన గర్ల్ ఫ్రెండ్‌ను వెనక్కి తెచ్చేసుకుంటాడు. మొత్తంగా టైసన్‌తో ముడిపడ్డ క్లైమాక్స్ సినిమాకు ప్లస్ కాకపోగా.. పెద్ద మైనస్ అయి కూర్చుంది. సినిమా మీద అప్పటికే తగ్గిన ఇంప్రెస్‌ను ఇంకా పోగొట్టి ప్రేక్షకులను చికాకు పెట్టింది. అంత పెద్ద లెజెండ్‌ను పూరి ఇంత కామెడీగా వాడుకున్నాడేంటి అని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతైంది. అసలీ పాత్రకు టైసన్ ఎలా ఒప్పుకున్నాడని కూడా జనాలకు అర్థం కావడం లేదు.
This post was last modified on August 25, 2022 7:08 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…