ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పటి యూత్ కి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లేదా ప్రభాస్ గోపిచంద్ లు గుర్తొస్తారు. కానీ సీనియర్లలో చిరంజీవి నాగార్జున ఎంత సఖ్యంగా ఉంటారో కొత్తగా చెప్పడానికేం లేదు. లాల్ సింగ్ చడ్డాని మెగాస్టార్ ప్రమోట్ చేయడానికి అమీర్ ఖాన్ మొదటి కారణమైతే అందులో చైతు ఉన్నాడనేది మరో రీజన్. సరే దాని ఫలితం దారుణంగా రావడం పక్కనపెడితే పలు సందర్భాల్లో ఈ ఇద్దరి మధ్య స్నేహం ఎంత ఘాడంగా ఉందో బయట పడుతూనే ఉంటుంది. ఆ బాండింగ్ కారణంగానే ఈ ఇద్దరూ ఎప్పుడు క్లాష్ అవ్వరు.
కానీ దసరా పండగను పురస్కరించుకుని ది ఘోస్ట్, గాడ్ ఫాదర్ లు ఒకేసారి అక్టోబర్ 5కి రావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంత సెలవుల సీజనైనా ఈ పోటీ అంత సేఫ్ కాదనేది వాళ్ళ అభిప్రాయం. ఒక పక్క మెగా మూవీ మలయాళం రీమేక్. అంచనాలు భయాలు సమాన స్థాయిలో ఉన్నాయి. టీజర్ బాగానే ఉందనిపించినా విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల కామెంట్లు ట్రోలింగ్ తప్పలేదు. ఇక వైల్డ్ డాగ్ డిజాస్టర్ తర్వాత నాగ్ మరోసారి ఇంగ్లీష్ టైటిల్ తో అలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తోనే వస్తున్నాడు. సో హైప్ తగినంత లేదు.
ఒకరు ముందో వెనకో వస్తే బాగుండేది కానీ సెప్టెంబర్ 30న పొన్నియన్ సెల్వన్ ఉండటం వల్ల అలా చేయలేని పరిస్థితి నెలకొంది. పోనీ వదులుకుందామా అంటే డిసెంబర్ దాకా డేట్ దొరకదు. సో ముఖాముఖీ తప్పదు. గతంలో ఈ ఇద్దరూ ఒకే రోజు తలపడిన దాఖలాలు అంతగా లేవు. కాకపోతే ఈసారి విచిత్రంగా ఇద్దరూ ఇంగ్లీష్ పేర్లతో ఢీ కొట్టుకోవడం విశేషం. లూసిఫర్ చూసినవాళ్లకు సబ్జెక్టు పరంగా గాడ్ ఫాదర్ మీద ఎగ్జైట్మెంట్ అంతగా లేదు. కానీ ది ఘోస్ట్ పూర్తిగా ఫ్రెష్ సబ్జెక్టు. మరి ఇద్దరు మిత్రుల్లో ఎవరు గెలుస్తారో లేక ఇటీవల బింబిసార, సీతారామంలు ఒకేరోజు వచ్చి విన్ అయినట్టు జాయింట్ గా నిలుస్తారో చూడాలి
This post was last modified on August 25, 2022 3:54 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…