Movie News

వైష్ణవ్ తేజ్.. 20 టేక్‌లు.. కన్నీళ్లు

పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే హీరోకు అవకాశం సులువుగానే రావచ్చు కానీ.. ఆ తర్వాత మనుగడ అంతా తన ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది. సరిగా నటించకపోతే, దాని వల్ల సినిమా చెడిపోతే కెరీర్ ముందుకు సాగడం కష్టం. ఐతే మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. తొలి సినిమా ‘ఉప్పెన’తో నటుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయి తన కెరీర్‌కు మాంచి ఊపే ఇచ్చింది. ఐతే ఈ సినిమా షూటింగ్‌లో కొన్ని తాను చాలా ఇబ్బంది పడడమే కాక.. యూనిట్‌ను ఇబ్బంది పెట్టినట్లు ఆలీ నిర్వహించే టాక్ షోకు అతిథిగా హాజరైన వైష్ణవ్ వెల్లడించాడు.

ఆ చిత్రంలో ‘నీకో మాట చెప్పాలి బేబమ్మా’ అంటూ ఎమోషనల్ డైలాగ్ చెప్పాల్సిన సీన్లో తాను తడబడ్డట్లు వైష్ణవ్ వెల్లడించాడు. ఆ సన్నివేశానికి 20కి పైగా టేక్‌లు తీసుకున్నట్లు అతను తెలిపాడు. ఆ సీన్లో తాను కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడాలని.. కానీ డైలాగ్ చెబుతున్నపుడు ఎందుకో తనకు మాటలు రాలేదని.. ఎమోషన్స్ పండించలేకపోయానని వైష్ణవ్ తెలిపాడు.

20 పైగా టేక్స్ అయ్యాయని.. అందరూ ఆ సీన్ ఎప్పుడు పూర్తవుతుందా అని చూస్తున్నారని.. అందరి సమయం, డబ్బు వృథా చేస్తున్నాననే ఫీలింగ్ కలిగి ఒక్కసారిగా బాధతో కన్నీళ్లు వచ్చేశాయని వైష్ణవ్ తెలిపాడు. అలాగే ఈ సినిమాలో ‘జలజలపాత నువ్వు’ రొమాంటిక్ సాంగ్ చేయడానికి కూడా తాను చాలా ఇబ్బంది పడ్డానని.. అంతమంది ముందు ఎలా రొమాన్స్ చేయాలో అర్థం కాలేదని అతను తెలిపాడు.

ఇక తాను బాలనటుడిగా చేసిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో తన పాత్రకు డైలాగ్స్ ఉండవని, తాను చాలా సీరియస్‌గా కనిపించాలని.. ఐతే ఒక సీన్లో తాను నవ్వేయడంతో పెదమావయ్య చిరంజీవి సీరియస్ అయ్యారని వైష్ణవ్ వెల్లడించాడు. ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్ చేసిన ‘కొండపొలం’ నిరాశపరచగా.. ఇప్పుడతను ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం సెప్టెంబరు 2న రిలీజవుతుంది.

This post was last modified on August 25, 2022 11:45 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

8 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

8 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago