‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అంతటి ప్రభంజనం సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. బయటి వాళ్ల సంగతి పక్కన పెడితే స్వయంగా ఈ చిత్ర దర్శకుడు సుకుమారే.. తన సినిమా ఇతర భాషల్లో అంత బాగా ఆడుతుందని ఊహించలేదని పోస్ట్ రిలీజ్ సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు. నార్త్ ఇండియాలో రిలీజ్ గురించి హడావుడి పడుతుంటే తాను నవ్వుకున్నట్లు వెల్లడించాడు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మరీ పెద్ద హిట్టేమీ కాదు.
బయ్యర్ల పెట్టుబడుల మీద కొంచెమే లాభం వచ్చింది. కానీ ఇతర భాషల్లో సినిమా పెట్టుబడి మీద ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టి సూపర్ హిట్ రేంజికి వెళ్లింది. సినిమా బాగా ఆడడం ఒకెత్తయితే.. ఇందులో బన్నీ డైలాగులు, మేనరిజమ్స్ జనం మీద చూపించిన ఇంపాక్ట్ మరో ఎత్తు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో క్రీడా ఈవెంట్లలో స్పోర్ట్స్ స్టార్లు ఆ మెడకింద చెయ్యి పెట్టి ‘తగ్గేదేలే’ అంటూ చూపించే మేనరిజంను ఇమిటేట్ చేసిన విధానం ఒక సంచలనం.
అలాగే ‘పుష్ప అంటే ఫ్లవరనుకున్నా.. కాదు ఫైరు’ అనే డైలాగ్ కూడా తిరుగులేని రీచ్ సంపాదించింది. ఇప్పుడీ డైలాగ్‌ను సౌత్ ఇండియన్ టాప్ స్టార్లలో ఒకడైన విక్రమ్ కూడా పలకడం విశేషం. తన కొత్త చిత్రం ‘కోబ్రా’ ప్రమోషన్లలో భాగంగా కోయంబత్తూరులో జరిగిన ఒక ప్రమోషనల్ ప్రెస్ మీట్లో విక్రమ్ ‘పుష్ప’ డైలాగ్‌ను వల్లెవేశాడు. విలేకరులో మధ్యలో ఎందుకో ‘పుష్ప’ గురించి ప్రస్తావించగా.. అందులోని ‘పుష్ప అంటే ఫ్లవరనుకున్నావా.. కాదు ఫైరు’ డైలాగ్‌ను విక్రమ్ వల్లెవేశాడు.
ఐతే కేవలం ఒకసారి డైలాగ్ చెప్పి వదిలేయడం కాదు.. రకరకాల మాడ్యులేషన్లలో చెబుతూ పోయాడు. పది రకాలుగా ఈ డైలాగ్ చెప్పొచ్చంటూ వేరియేషన్లు చూపించాడు. చివర్లో ‘జెమిని’ సినిమాను గుర్తు చేస్తూ తన స్టయిల్ అంటూ ‘ఓ పోడు’ మేనరిజంతో పుష్ప డైలాగ్‌ను విక్రమ్ చెప్పడం విశేషం. విక్రమ్ ఈ పని హైదరాబాద్‌లో చేస్తే విశేషమేమీ లేదు కానీ.. తమిళనాట ఇలా మన తెలుగు హీరో డైలాగ్‌ను ఇన్ని వేరియేషన్లలో చెప్పడం గొప్ప విషయమే. ‘పుష్ఫ’ రీచ్ ఎలాంటిదో చెప్పడానికి ఇది తాజా రుజువు.
This post was last modified on August 25, 2022 12:17 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…