Movie News

యుఎస్‌లో ‘లైగర్’ ప్రభంజనం

తెలుగు ప్రేక్ష‌కులందు యుఎస్ ఎన్నారై తెలుగు ఫ్యాన్స్ కొంచెం భిన్నం. తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్క‌డ మాస్ మ‌సాలా సినిమాల‌కు ఆద‌ర‌ణ ఉండ‌దు. వాళ్లు ఎక్కువ‌గా క్లాస్ ల‌వ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్లు, థ్రిల్ల‌ర్ల‌ను ఎక్కువ ఆద‌రిస్తారు. కొన్నిసార్లు మాస్ మ‌సాలా సినిమాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోరు. ఆ టైపు సినిమాల‌కు ప్రిమియ‌ర్స్ ప‌రంగా కూడా అంత సంద‌డి క‌నిపించ‌దు.

కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించిన మాస్ మూవీ లైగ‌ర్‌కు మాత్రం యుఎస్‌లో రెస్పాన్స్ మామూలుగా లేదు. ఈ సినిమాను టాప్ స్టార్ల రేంజిలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. విజ‌య్‌కి బేసిగ్గా యుఎస్‌లో మంచి ఫాలోయింగే ఉంది. పెళ్ళిచూపులుతో పాటు అర్జున్ రెడ్డి సినిమాతో అత‌ను అక్క‌డ సూప‌ర్ పాపులారిటీ సంపాదించాడు. ట్యాక్సీవాలా, డియ‌ర్ కామ్రేడ్ సినిమాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌క్క‌డ‌. 

పూరితో  విజ‌య్‌  కాంబినేష‌న్ జ‌నాల్లో బాగానే క్యూరియాసిటీ పెంచుతోంది. దీనికి తోడు అమెరికా బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ ఓ కీల‌క పాత్ర చేయ‌డం ప్ల‌స్ అయింది. దీంతో యుఎస్‌లో సినిమాకు భారీ బిజినెస్ జ‌రిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అందుకు త‌గ్గ‌ట్లే జోరుమీదున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధ‌వారం సాయంత్రానికే ప్రి సేల్స్ ద్వారా 2.75 ల‌క్ష‌ల డాల‌ర్లు రాబ‌ట్ట‌డం విశేషం.

లైగ‌ర్ లాంటి మాస్ మూవీకి ఈ సేల్స్ అసాధార‌ణం. దీన్ని బ‌ట్టి చూస్తే ప్రిమియ‌ర్స్‌తో క‌లిపి తొలి రోజునే ఈ చిత్రం హాఫ్ మిలియ‌న్ క్ల‌బ్బులో చేర‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే వీకెండ్లోపే మిలియ‌న్ డాల‌ర్ల మార్కును కూడా అందుకుంటుంది. ఫుల్ ర‌న్లో 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్బులోకి కూడా చేరే అవ‌కాశ‌ముంది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను రూ.9 కోట్ల‌కు అమ్మారు. బ్రేక్ ఈవెన్ పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌నే అనిపిస్తోంది.

This post was last modified on August 25, 2022 12:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లరోడికి పరీక్ష : 1 అవకాశం 3 అడ్డంకులు!

పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…

9 minutes ago

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

25 minutes ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

3 hours ago

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

12 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

13 hours ago