టాలీవుడ్ లో సినిమాలకు పెద్ద సీజన్స్ అంటే అందులో ఒకటి సంక్రాంతి రెండు దసరా మూడు సమ్మర్. ఈ సీజన్స్ లో స్కూల్స్, కాలేజీలు , ఆఫీస్ లకు పండగ సెలవలు ఉండటంతో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా ఈ సీజన్ లో గట్టి కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు. అందుకే స్టార్ హీరోలందరూ ఈ సీజన్స్ పై ముందు నుండే ఖర్చీఫులు వేస్తుంటారు.
ఈసారి ఈ మూడు సీజన్స్ మీద మెగా స్టార్ కర్చీఫ్ పడింది. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును బేసిక్ గా చిరు లాంటి స్టార్ హీరోకి సీజన్స్ తో పని ఉండదు. సినిమా రిలీజ్ అయితేనే పండగలా భావించే స్టార్ చిరు. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే రీ ఎంట్రీ ఇచ్చిన ‘ ఖైదీ నంబర్ 150’ సినిమా తప్ప మిగతా సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర బిగ్ నంబర్స్ తీసుకురాలేకపోయాయి.
పైగా ‘ఆచార్య’ కలెక్షన్స్ గురించి అందరికీ తెలిసిందే. చాలా ఏరియాల్లో ఆ సినిమా చిరు ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. అందుకే ఈసారి మూవీ లవర్స్ థియేటర్స్ కి విపరీతంగా వచ్చే మూడు సీజన్స్ లో తన మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు చిరు. నిజానికి ఇది చిరు డిసీషణ్ మాత్రమే కాకపోవచ్చు కానీ మెగా స్టార్ తో నిర్మాతలు కచ్చితంగా మాట్లాడతారు కదా.. ఆ డిస్కషన్ లో చిరు కూడా రిలీజ్ డేట్స్ విషయంలో తన నిర్ణయం ఇదీ అని చెప్పి ఉండొచ్చు.
రెండు బిగ్ ఫెస్టివల్స్ , సమ్మర్ లో అయితే తన సినిమాలకు ఓపెనింగ్స్ డోకా ఉండదని భావించి ఉండొచ్చు. అలాగే సినిమా యావరేజ్ టాక్ అందుకున్నా డీసెంట్ కలెక్షన్స్ పక్కా.. కాబట్టే ఈ డేట్స్ ఫిక్స్ చేసుకొని ఉండొచ్చు. మెగా స్టార్ అక్టోబర్ 5న దసరా సందర్భంగా ‘గాడ్ ఫాదర్’ తో , సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య'(వర్కింగ్ టైటిల్) గా , సమ్మర్ లో ఏప్రిల్ 14న ‘భోళా శంకర్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
This post was last modified on August 24, 2022 11:54 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…