లైగర్.. ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు, మొత్తం ఇండియన్ బాక్సాఫీస్ దృష్టంతా ఈ చిత్రం మీదే ఉంది. సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న ‘లైగర్’ మీద పెద్ద బడ్జెట్టే పెట్టారు. సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేయడం విశేషం. అంటే ఆ మేర షేర్ వస్తేనే సినిమా హిట్ అన్నట్లు.
ఒక ఏరియాల వారీగా ‘లైగర్’ బిజినెస్ వివరాల విషయానికి వస్తే.. నైజాం ఏరియా హక్కులను రూ.22 కోట్లకు అమ్మారు. వైజాగ్ రేటు రూ.6 కోట్లు పలికింది. సీడెడ్లో ‘లైగర్’ బిజినెస్ రూ.9 కోట్లకు చేరడం విశేషం. ఇక ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నింటికీ కలిపి రూ.18 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు హక్కులు కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’ బిజినెస్ రూ.55 కోట్లు. కర్ణాటక హక్కులు రూ.5 కోట్లకు, తమిళనాడు రైట్స్ రూ.2.5 కోట్లకు అమ్ముడవగా.. కేరళలో రూ.1.5 కోట్ల మేర ఈ సినిమా బిజినెస్ చేసింది. హిందీ హక్కులను రూ.12 కోట్లకు అమ్మారు.
ఇలా మొత్తం ఇండియా వైడ్ బిజినెస్ రూ.రూ.76 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్ రైట్స్ రూ.9 కోట్లు పలికాయి. పబ్లిసిటీ ఖర్చు కూడా కలిపితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.90 కోట్లు అయింది. సినిమా మీద మంచి అంచనాలుండడంతో పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడం కష్టమేమీ కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరగడంతో తొలి రోజే ఈ చిత్రం రూ.25 కోట్ల మేర షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. టాక్ బాగుంటే తొలి వీకెండ్ అయ్యేసరికే సినిమా బయ్యర్ల పెట్టుబడిలో 75 శాతానికి పైగా రికవరీ చేసే అవకాశముంది. గురువారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతుండగా.. బుధవారం యుఎస్‌లో ప్రిమియర్స్ పడుతున్నాయి.
This post was last modified on August 24, 2022 10:16 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…