Movie News

తమిళంలోకి UV.. తెలుగులోకి సూర్య

ఇప్పుడు భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. మన దర్శకులు తమిళంలో సినిమాలు చేస్తున్నారు. తమిళ హీరోలు తెలుగులోకి అడుగు పెడుతున్నారు. అలాగే మన హీరోలు, దర్శకులు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నారు. ఇలా గత కొన్నేళ్లుగా సినిమా ముఖచిత్రం పూర్తిగా మారుతో వస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్లు విజయ్, ధనుష్ తెలుగులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

వీరి కంటే ముందు తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించిన సూర్య మాత్రం డైరెక్ట్ తెలుగు మూవీ చేసే విషయంలో ఇదిగో అదిగో అంటున్నాడే తప్ప అడుగులు ముందుకు పడడం లేదు. ఐతే పూర్తి తెలుగు సినిమా అని చెప్పలేం కానీ.. చాలామంది స్టార్ల తరహాలో అథెంటిక్ బైలింగ్వల్ ఫిలిం చేయడానికి సూర్య రెడీ అయ్యాడు. అతను కథానాయకుడిగా ‘శౌర్యం’ శివ ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.

సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండడం విశేషం. యువి వాళ్లు ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమాలు తీశారు కానీ.. నేరుగా తమిళంలో అడుగు పెట్టబోతుండడం ఇదే తొలిసారి. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ అయిన శివ.. తెలుగులో ‘శౌర్యం’ సినిమాతోనే దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం సూపర్ హిట్టయింది. తర్వాత శంఖం, దరువు సినిమాలు తీయగా అవి నిరాశ పరిచాయి.

ఆ తర్వాత అతను తమిళంలో ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆపై అజిత్‌తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్‌బస్టర్లు తీశాడు. చివరగా రజినీతో శివ చేసిన ‘అన్నాత్తె’ నిరాశ పరిచింది. కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు సూర్యతో తన మార్కు మాస్ ఎంటర్టైనర్ తీయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తుందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడు. 

This post was last modified on August 24, 2022 8:55 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

1 hour ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago