Movie News

ఆ హీరోను తెలుగోళ్లు పట్టించుకుంటారా?

ఒక సేతు.. ఒక సామి.. ఒక పితామగన్.. ఒక అన్నియన్.. మామూలు హిట్లా ఇవి. ఈ భారీ విజయాలతో అప్పట్లో విక్రమ్ పేరు మార్మోగిపోయింది తమిళనాట. ఇందులో పితామగన్‌ను శివపుత్రుడుగా, అన్నియన్‌ను అపరిచితుడుగా తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడా అవి బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. తెలుగులోనూ విక్రమ్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. దీంతో వరుసబెట్టి అతడి సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు. కానీ ‘అన్నియన్’ తర్వాత గత 17 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు.

ఐ సహా కొన్ని చిత్రాలు తమిళంలో అయినా బాగా ఆడాయి కానీ.. తెలుగులో మాత్రం ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్‌కు నిఖార్సయిన హిట్టు ఒక్కటీ లేదు. ఇంతకుముందు విక్రమ్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా చూసేవారు కానీ.. ఈ మధ్య పట్టించుకోవడమే మానేశారు. దీంతో అతను నటించిన కొన్ని సినిమాలు తెలుగులో విడుదలే కాలేదు కూడా. ఇలాంటి టైంలో ‘కోబ్రా’ చిత్రంతో తెలుగులోకి తిరిగి అడుగు పెడుతున్నాడు విక్రమ్.

తమిళంలో డిమాంటి కాలనీ, ఇమైక నోడిగల్ (తెలుగులో అంజలి ఐపీఎస్) లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన అజయ్ జ్ఞానముత్తు రూపొందించిన చిత్రమిది. ఈ నెల 31న వినాయక చవితి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతోంది. చాన్నాళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న సినిమాను ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

కాకపోతే విక్రమ్ ఎప్పట్నుంచో చేస్తున్నదే ఈ సినిమాలోనూ చేసినట్లుగా కనిపిస్తోంది. జీనియస్ అయిన లెక్కల మాస్టారు వేర్వేరు వేషాలు వేసుకుని క్రైమ్స్ చేసే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్లో విక్రమ్ రకరకాల వేషాలు చూసి అతడికి ఇంకా ఈ పిచ్చి వదల్లేదా అన్న ఫీలింగ్ కలిగింది. కమల్ హాసన్ ఎప్పుడో ఇలాంటివి చేసేశాడు.

తర్వాత విక్రమ్ కూడా మల్లన్నసహా కొన్ని చిత్రాల్లో ఇలాంటివి ట్రై చేశాడు. ఇక మళ్లీ అతను కొత్తగా ఏం చూపిస్తాడో అర్థం కావడం లేదు. ట్రైలర్ అయితే అనుకున్నంత ఆసక్తికరంగా లేడు. పవన్ ఫుల్ విలన్ అవసరమైన ఇలాంటి సినిమాకు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌ను ఎందుకు తీసుకున్నారో అంతుబట్టడం లేదు. ఇలాంటి కంటెంట్‌తో అయితే విక్రమ్‌ను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోవడం కష్టమే. ‘కోబ్రా’ తెలుగులో అనుకున్నంత ఇంపాక్ట్ అయితే వేసేలా, విక్రమ్ కోరుకున్న విజయాన్ని అందించేలా కనిపించడం లేదు.

This post was last modified on August 24, 2022 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago