ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులతో పాటు సినీ జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘లైగర్’యే. ప్రాంతీయ చిత్రమే అయినప్పటికీ ‘అర్జున్ రెడ్డి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన విజయ్ దేవరకొండ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామ్యంలో ప్రాపర్ హిందీ సినిమాలాగే దీన్ని తీర్చిదిద్దారు. తెలుగు రాష్ట్రాల్లో ‘లైగర్’కు బంపర్ క్రేజ్ కనిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాల స్థాయిలో దీన్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోతున్నాయి.
ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే విజయ్ సినిమాలకు తెలుగులో క్రేజ్ మామూలే. ఐతే ‘లైగర్’ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తూ అగ్రెసివ్‌గా ప్రమోట్ చేయడం, విజయ్ ఎక్కడికి వెళ్లినా జనాలు అతడికి బ్రహ్మరథం పట్టడంతో ఈ ఎఫెక్ట్ అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ మీద ఏమాత్రం పడుతుంది.. బౌండరీల అవతల విజయ్ సత్తా చూపిస్తాడా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
ముఖ్యంగా నార్త్ ఇండియాలో విజయ్ ఆకర్షణ ఏమాత్రం పని చేస్తుందా అని అంతా ఉత్కంఠతో చూస్తున్నారు. అందులోనూ ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని ఒక వర్గం పిలుపునివ్వడంతో ఆ ప్రభావం గురించి చర్చించుకుంటున్నాు. ఐతే అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తే మాత్రం ‘లైగర్’ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ముంబయి, ఢిల్లీ సహా ఉత్తరాదిన ప్రధాన నగరాల్లో బుకింగ్స్ డల్లుగా నడుస్తున్నాయి. ఎక్కడా ‘లైగర్’ హిందీ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ చూపించట్లేదు. ఐతే హిందీలో ప్రస్తుతం అక్కడి సూపర్ స్టార్లు నటించిన పెద్ద పెద్ద సినిమాలకు కూడా జనాలేమీ ఎగబడట్లేదు.
అడ్వాన్స్ బుకింగ్స్ అందరికీ డల్లుగా నడుస్తున్నాయి. పైగా విడుదలకు నాలుగైదు రోజుల ముందే ఇలా టికెట్లు పెట్టగానే అలా కొనేందుకు ఎగబడే టైపు కాదు నార్త్ ఆడియన్స్. కరోనాకు ముందు కూడా వారిలో ఇలాంటి క్యూరియాసిటీ కనిపించేది కాదు. ఇప్పుడు ఆసక్తి ఇంకా తగ్గింది. హిందీలో పుష్ప, కార్తికేయ సినిమాలకు కూడా విడుదలకు ముందు బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జరగలేదు. ఆమాటకొస్తే ‘బాహుబలి-1’, ‘కేజీఎఫ్-1’లకు సైతం హైప్ కనిపించలేదు. రిలీజయ్యాక ఈ చిత్రాల మౌత్ టాక్ అదిరిపోవడంతో అవి ఊహించని రేంజికి వెళ్లాయి. ‘లైగర్’ విషయంలోనూ అలాగే జరుగుతుందేమో చూద్దాం.
This post was last modified on August 23, 2022 2:15 pm
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో హైదరాబాద్ యువ క్రికెటర్…