ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు హంగామా మాములుగా లేదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో మొదలుపెట్టి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరు అదేదో తమ ఇంటి కుటుంబ సభ్యుడి బర్త్ డే అన్నంత ఆనందంగా ఫీలవుతూ విషెస్ చెబుతున్నారు. కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్లతో మొదలుపెట్టి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల దాకా అందరూ మెగా శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. టీవీలో పాత సినిమాలు, థియేటర్లో ఘరానా మొగుడు హంగామా ఓ రేంజ్ లో జరిగిపోతోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు పూరి జగన్నాధ్ ఆసక్తికరమైన పాన్ కథ ఒకటి పంచుకున్నారు. సుమారు పదిహేనేళ్లకు పైగా వెనక్కు వెళ్తే ఓసారి చిరంజీవి సరదాగా పూరిని కారులో ఎక్కించుకుని అలా బయటికి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఊరికే సరదాగా అన్నారు తప్ప కారణం చెప్పలేదు. అప్పటికి మాదాపూర్ పరిసరాలు ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు. ఫారం మాల్ నిర్మాణం కూడా జరగలేదు. అలా వెళ్తుండగా ఒక చోట నిర్మానుషమైన ప్రాంతంలో ఓ చిన్న పాన్ డబ్బా కనిపిస్తే మెగాస్టార్ నేరుగా దాని ముందుకెళ్లి ఆపారు. దుకాణంలో కిళ్ళీలు కట్టే వ్యక్తి తప్ప ఇంకెవరు లేరు. చిరు నేరుగా అతన్ని పిలిచి పాన్ కట్టమని పురమాయించారు.
ఒక్కసారిగా అతగాడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చిరంజీవి తన బడ్డీ కొట్టుకు రావడం ఏమిటని షాక్ లో ఉంటూనే లోపలికి పరిగెత్తుకు వెళ్ళాడు. ఒకపక్క పాన్ తయారు చేస్తూనే ఎవరికైనా ఈ విషయం చెప్పాలనే ఉద్వేగంలో మెగాస్టార్ మెగాస్టార్ అని పదే పదే అరుస్తున్నాడు. కానీ అక్కడ ఎవరైనా ఉంటేగా వినిపించుకోవడానికి. అలా మెగా చేతుల మీదుగా డబ్బులు పుచ్చుకోవడం, కారు తిరిగి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. అతని ఎగ్జైట్ మెంట్ అలా మనసులో ముద్రించుకుపోయిందని పూరి వివరించాడు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు కాబోలు పాపం సెల్ఫీ మిస్ అయ్యింది. ఒకవేళ ఆ పాన్ వాలా ఎవరికైనా చెప్పినా నమ్మరు సరికదా ఎగతాళి కూడా చేసుంటారు.
This post was last modified on August 22, 2022 5:25 pm
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…