ఇప్పుడు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే పుష్ప-2నే. గత ఏడాది డిసెంబరులో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. ముఖ్యంగా హిందీలో ఆ చిత్రం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై అనూహ్య విజయం సాధించింది. దీంతో పుష్ప-2 మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది.. సినిమా ఎప్పుడు పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఐతే చాలా రోజుల ముందే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అంచనాల ఒత్తిడి బాగా ఎక్కువ అయిపోవడంతో సుకుమార్ అంత తేలిగ్గా స్క్రిప్టును లాక్ చేయలేదు. ముందు అనుకున్న కథను మార్చి.. నెలల తరబడి డిస్కషన్లు జరిపి చివరికి స్క్రిప్టు ఒక కొలిక్కి తెచ్చారు. ఎట్టకేలకు ఈ సోమవారం ‘పుష్ప-2’ పూజ నిర్వహించబోతున్నారు. అలా అని వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలైపోతుందా అంటే అదేమీ కాదు.
హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అతను పూజా కార్యక్రమంలోనూ పాల్గొనట్లేదు. చాలా సింపుల్‌గా ఆ కార్యక్రమం పూర్తి చేయిస్తున్నారు. తర్వాత సరైన ముహూర్తం లేకపోవడంతో ఇప్పుడీ తంతు పూర్తి కానుంది. ‘పుష్ప-2’ షూటింగ్ సెప్టెంబరు ద్వితీయార్ధంలో మొదలవుతుందని సమాచారం. బన్నీ ఇండియాకు తిరిగి వచ్చాక తిరిగి పుష్పరాజ్‌గా మారడానికి కొన్ని రోజులు సమయం పడుతుంది. ఇంకాస్త జుట్టు, గడ్డం పెంచాల్సి ఉంది. తర్వాత ఒకసారి లుక్ టెస్ట్ చేయించుకుని షూటింగ్‌కు హాజరవుతాడు.
ఈ లోపు మిగతా ఆర్టిస్టుల డేట్లు అవీ సర్దుబాటు చేసుకుని, షెడ్యూళ్లు పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతుంది సుక్కు టీం. ‘పుష్ప-1’ విషయంలో బాగా హడావుడి అయిన నేపథ్యంలో ఈసారి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ అన్నీ కూడా కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలని సుకుమార్ అండ్ టీం ఫిక్సయింది. పార్ట్-2 షూటింగ్ వచ్చే ఏడాది జూన్‌కు పూర్తి కావచ్చని అంచనా. ఆ తర్వాత మూడు నెలలు గ్యాప్ పెట్టుకుని దసరా టైంకి సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయట.
This post was last modified on August 22, 2022 12:36 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…