ఒకప్పుడు అభిమానుల డిమాండ్లు హీరోలకు నిర్మాతలకు తెలియాలంటే కేవలం ఉత్తరాలు మాత్రమే ఉండేవి. అవి కూడా వాళ్ళ అసిస్టెంట్లు చదివి ముఖ్యమైనవి మాత్రమే సదరు స్వీకరణకర్తలకు అందేలా చేసేవారు. తర్వాత కొంత కాలం ఈమెయిల్స్ నడిచాయి కానీ వాటికీ ఇదే సమస్య. కానీ ఇప్పుడలా కాదు. ఫ్యాన్స్ అందరూ మూకుమ్మడిగా ఒక టాపిక్ ట్రెండ్ చేశారంటే అది నేరుగా సదరు వ్యక్తికి చేరిపోతోంది. తాజాగా నిర్మాత దిల్ రాజుకి తన నిర్మాణంలో ఉన్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ విషయంలో ఈ సెగ తగిలింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు హైదరాబాద్ హైటెక్స్ లో కార్నివల్ పేరిట భారీ వేడుకలు నిర్వహించారు. అతిథులు చాలానే వచ్చారు. అందులో దిల్ రాజు ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్ చరణ్ 15 అప్డేట్ ఇవ్వమని తనను ఫ్యాన్స్ ట్రెండ్ చేశారని అది చెన్నై నుంచి తన టీమ్ చెప్పారని, అదే మాట దర్శకుడికి చేరవేసి వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ కానీ టైటిల్ కానీ ఇచ్చేయమని శంకర్ ని అడగటం అన్నీ జరిగిపోయాయట. తనను ఆడుకున్నారని దిల్ రాజే స్వయంగా చెప్పడం విశేషం.
ఏ రూపంలో అయితేనేం మొత్తానికి సోషల్ మీడియా ప్రభావం ఈ రేంజ్ లో సాగుతోందన్న మాట. నిజానికి చరణ్ ఫ్యాన్స్ ఇంతగా ఇదైపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ గురించి ఏదైనా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించడం. రెండోది దీన్ని ఆపేసి శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 పూర్తి చేయడానికి వెళ్లిపోయారని ప్రచారం జరగడం. వీటిని కొట్టిపారేయలేదు కానీ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోందనే మాటైతే రాజు గారు అనలేదు. సో తాత్కాలికంగా విరామం ఇచ్చిన మాట వాస్తవమే అనుకోవాలి.
This post was last modified on August 22, 2022 10:23 am
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…