రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు దర్శకుడిగా ఎంత పతనం అయిపోయాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది ఆయన్నుంచి డేంజరస్, కొండా, అమ్మాయి అంటూ ఏవో సినిమాలు వచ్చాయి. వాటిని థియేటర్లలో రిలీజ్ చేస్తే సినిమాలు ఆడించడానికి అయిన మెయింటైనెన్స్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. ఇదే దర్శకుడు మూడు దశాబ్దాల ముందు శివ సినిమాతో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కూడా ఒక పది పదిహేనేళ్లు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.
ఇండియన్ సినిమాను కొత్త పుంతలు తొక్కించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. వర్మ అండతో పదుల సంఖ్యలో ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీలోకి వచ్చారు. వివిధ భాషల్లో గొప్ప పేరు సంపాదించాడు. అలాంటి వారిలో బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ కూడా ఒకడు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా కొన్ని క్లాసిక్స్ తీసిన ఈ దర్శకుడి నుంచి తాజాగా దోబారా అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వర్మ నుంచి తాను ఎలా ఫిలిం మేకింగ్ నేర్చుకున్నది అనురాగ్ వెల్లడించాడు. వర్మ దగ్గర పని చేయడం అంటే ఫిలిం స్కూల్‌కు వెళ్లడమే అని అతను వ్యాఖ్యానించాడు. చాలామంది దర్శకులు తమ దగ్గర పని చేసే అసిస్టెంట్ల విషయంలో ఇన్‌సెక్యూర్ ఫీలవుతుంటారని., వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వరని, కానీ వర్మ అలా కాదని.. ఎవరు ఏ ఐడియా ఇచ్చినా తీసుకుంటారని.. సత్య సినిమాలో కల్లుమామ పాటను పూర్తిగా అసిస్టెంట్లకు అప్పగించి వారితోనే తీయించారని అనురాగ్ వెల్లడించాడు.
కెమెరామన్‌కు ఏదైనా కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది తలెత్తితే తనకో డిజిటల్ కెమెరా ఇచ్చేసి సీన్లు చెప్పి ఎలా తీస్తావో తీయి అని చెప్పి.. అందులో నచ్చినవి ఎంచుకుని కెమెరామన్‌కు ఇన్‌పుట్స్‌గా ఇచ్చేవాడని అనురాగ్ తెలిపాడు. రాము అంత సెక్యూర్ పర్సన్‌ను తాను అంత వరకు చూడలేదని.. ఆయన దగ్గర పని చేసిన ప్రతి రోజూ ఎంతో నేర్చుకున్నానని.. మూడేళ్ల పాటు ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తున్నట్లే ఉండేదని చెబుతూ.. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్జీవీ ఈజ్ ద బెస్ట్ అంటూ అనురాగ్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
This post was last modified on August 21, 2022 5:37 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…