Movie News

హీరోయిన్‌గా రోజా కూతురు?

సినీ కుటుంబాల నుంచి కొత్తగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు కానీ.. అమ్మాయిలు ఇటు వైపు రావడం తక్కువే. చాలా కొద్ది మంది మాత్రమే తమ కూతుళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొస్తుంటారు. వాళ్లలో సక్సెస్ అయ్యేవాళ్లు కూడా తక్కువే. సీనియర్ హీరోయిన్ రాధ తన ఇద్దరు కూతుళ్లనూ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. కానీ ఆ ఇద్దర ఫెయిలయ్యారు. కొంత కాలానికే కనుమరుగైపోయార.

మలయాళంలో మేనక తన కూతురు కీర్తి సురేష్‌ను పరిశ్రమలోకి తీసుకురాగా ఆమె మంచి పేరు సంపాదించి పెద్ద రేంజికి వెళ్లింది. ఆమెను చూశాక ఇంకా చాలా మంది సీనియర్ హీరోయిన్లకు ఆశ పుట్టి ఉండొచ్చు. అందులో రోజా కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె తన కూతురు అన్షును కథానాయికను చేయాలని చూస్తున్నట్లు సమాచారం. చాలా ఏళ్లు తన కూతురిపై మీడియా కళ్లు పడకుండా చూసిన రోజా గత ఏడాది కాలంలో కొన్ని సందర్భాల్లో తన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తల్లి లాగే అందంగా, చక్కటి నవ్వుతో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది అన్షు. త్వరలోనే ఆమె కథానాయికగా పరిచయం కాబోతోందన్నది రోజా సన్నిహిత వర్గాల సమాచారం. ఒక సినీ వారసుడు కథానాయకుడిగా పరిచయం కానున్న సినిమాలో రోజా తనయ కూడా కథానాయికగా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం అన్షు యుఎస్‌లోని ఒక ఫేమస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణకు వెళ్లబోతోందట.

ఆమెకు అక్కడ సీటు కన్ఫమ్ అయిందని.. కొన్ని నెలల పాటు అక్కడ శిక్షణ తీసుకుని, కోర్సు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొస్తుందని.. తర్వాత ఆమె తొలి చిత్రం మొదలవుతుందని అంటున్నారు. రోజాకు ఒక కొడుకు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అతను చిన్నవాడు. భవిష్యత్తులో అతను కూడా హీరోగా అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక శాఖా మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు అందుకున్నాక రోజా సినిమాలు, టీవీ షోలకు పూర్తిగా దూరం అయ్యారు.

This post was last modified on August 21, 2022 4:29 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

7 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

5 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

13 hours ago