సినిమాల విషయంలో నిర్మాత దిల్ రాజు ఎంత క్యాలికులేటెడ్ గా ఉంటారో ఇండస్ట్రీలోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆయన మీద ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంది. ఈ మధ్య కొన్ని జడ్జ్ మెంట్లు తేడా కొట్టిండొచ్చు కానీ డిస్ట్రిబ్యూషన్, హక్కులు కొనుగోలు లాంటి డీల్స్ లో మాత్రం రాజు గారిది అందెవేసిన చేయి. మాములుగా మొహమాటానికి పోవడం, కేవలం దర్శకుడి పేరు చూసి కొనేయడం అరుదుగా చేస్తుంటారు. అలా 2017లో కొన్న కార్తీ డబ్బింగ్ మూవీ చెలియా (తమిళ వెర్షన్ కాట్రు వెలిదై) ఆర్థికంగా బాగా చేదు ఫలితాన్ని ఇచ్చింది
కేవలం మణిరత్నం పేరు చూసి కొనేశానని ఓకే బంగారంని మించి ఆడుతుందనే తన అంచనా పూర్తిగా తప్పి నష్టాలు చవి చూడాల్సి వచ్చిందని దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. నిజంగానే అదో పెద్ద డిజాస్టర్. కట్ చేస్తే ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 తిరిగి ఆయనే అందిస్తున్నారు. ఈసారి కంటెంట్ మీద నమ్మకంతో నిర్ణయం తీసుకున్నారో లేక ట్రైలర్ కట్ చూసి ఇంత పెద్ద క్యాస్టింగ్ తో మణి సార్ మేజిక్ ఓ రేంజ్ లో పండి ఉంటుందనే భరోసాతో ఫిక్స్ అయిపోయారో సెప్టెంబర్ 30 విడుదల తేదీకి తేలిపోనుంది.
మొత్తానికి పిఎస్ 1 చాలా సవాళ్ళను ఎదురుకోవాల్సి ఉంటుంది. మణిరత్నం మునుపటి ఫామ్ ని ఇదే తీసుకురావాలి. లేదంటే ఇక ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా ఒకప్పటి గౌరవంతోనే ఇంత పెద్ద క్యాస్టింగ్, వందల కోట్ల బడ్జెట్ తో దీని నిర్మాణం జరుగుతోంది. టాలీవుడ్ కు బాహుబలి నిలిచిపోయినట్టు కోలీవుడ్ కు ఈ పొన్నియన్ సెల్వన్ ల్యాండ్ మార్క్ అవ్వాలని అభిమానుల కోరిక. మరి రాజమౌళి స్ఫూర్తితోనే ఇంత సాహసం చేశానని ఒప్పేసుకున్న మణిరత్నం మరి టేకింగ్ లోనూ అదే స్థాయిలో మెప్పించగలరా చూడాలి.
This post was last modified on August 21, 2022 4:14 pm
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…